బోయపాటి, సుక్కు.. కాంబినేషన్ పక్కా!

Update: 2022-07-29 01:30 GMT
తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు అప్పట్లో ఎక్కువగా కొత్త దర్శకులతోనే సినిమాలను తెరపైకి తీసుకువచ్చారు. అయితే శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ లో దర్శకులుగా పరిచయమైన వారు ప్రస్తుతం అగ్ర దర్శకులుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అందులో చాలావరకు దిల్ రాజుతో మొదటి సినిమా చేసిన వారు మళ్లీ రెండవ సినిమా కూడా చేసేవారు. ఆ విధంగా అప్పట్లో దిల్ రాజు దర్శకులను తన వైపు తిప్పుకునే వారు.

ప్రస్తుతం అనిల్ రావిపూడి వరుసగా ఆయన ప్రొడక్షన్లోనే సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఒక ఇద్దరు అగ్ర దర్శకులతో మాత్రం దిల్ రాజు మళ్ళీ కంటిన్యూగా సినిమాలు చేయలేకపోయారు. వారు మరెవరో కాదు. బోయపాటి శ్రీను, సుకుమార్. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య సినిమాను దిల్ రాజు నిర్మించిన విషయం తెలిసిందే. అలాగే బోయపాటి భద్ర సినిమా కూడా ఆయన నిర్మించారు.

ఈ రెండు సినిమాలు కూడా దిల్ రాజుకు నిర్మాతగా మంచి లాభాలను అందించాయి. ఇక మళ్లీ వారిద్దరితో కలిసి మరొక సినిమా కూడా చేయాలని అనుకున్నారు. అయితే సుకుమార్ చెప్పిన రెండవ కద జగడం అంతక నచ్చకపోవడంతో మార్పులు చేయమని అన్నాడు.

అప్పట్లో సుక్కు మొండిగా దిల్ రాజు మాట వినకుండా ఆ సినిమాను మరో హీరో రామ్ తో తెరపైకి తీసుకువచ్చాడు. కానీ ఆ సినిమా ఫ్లాప్ కావడం ఆ తర్వాత సుక్కు మళ్ళీ దిల్ రాజు వద్దకు రావడంతో మరొక సినిమా చేయాలని అనుకున్నారు.

కానీ చాలా కాలంగా ఆ కాంబినేషన్ అలా చర్చల్లో కొనసాగుతోంది. ఇక బోయపాటి మాత్రం అనుకోకుండా మరొక కమిట్మెంట్స్ ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పారు. ఇక ఇటీవల అయితే దిల్ రాజు వారిద్దరితో మళ్ళీ పక్కా రెండవ సినిమాలు ఉంటాయని అని వివరణ ఇచ్చారు. ముఖ్యంగా సుకుమార్ తో రానున్న రోజుల్లో ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ కూడా ఇవ్వబోతున్నట్లు తెలియజేశారు. ఇక బోయపాటితో సినిమాపై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.
Tags:    

Similar News