సాహోకు దిల్ రాజు సూపర్ డీల్ ?

Update: 2019-06-08 04:43 GMT
రెండేళ్ళుగా షూటింగ్ జరుపుకుంటూ డార్లింగ్ ఫ్యాన్స్ ని ఊరిస్తూ వస్తున్న ప్రభాస్ సాహో ఎట్టకేలకు ఫైనల్ స్టేజికు వచ్చేసింది. ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయ్యిందని ఇప్పటికే న్యూస్ వచ్చింది. ఇదిలా ఉండగా సాహోకు దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ కోసం నైజాం ఉత్తరాంధ్ర కలిపి సుమారు 45 కోట్ల దాకా ఆఫర్ చేసినట్టు వచ్చిన వార్త ట్రేడ్ లో ప్రకంపనలు రేపుతోంది. ఎందుకంటే ఇది ఎవరూ పోటీ పడలేని భారీ మొత్తం.

ఒకవేళ ఎవరైనా అంతకంటే కాస్త ఎక్కువ ఇచ్చి తెగిద్దాం అనుకున్నా రాజు గారి బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉన్న వారిని కాదని యువి సంస్థ ఇంకొకరికి ఇచ్చే రిస్క్ తీసుకోదు. కాబట్టే ఈ డీల్ ఓకే అయ్యిందని వినికిడి. ఇంత రిస్క్ తీసుకుని పెట్టుబడి పెట్టడంలో అంతరార్థం ఏమైనా సాహో మీద దిల్ రాజుకున్న గట్టి నమ్మకాన్ని ఇది చూపిస్తోంది.

ఇది ప్రభాస్ ను ఆకట్టుకోవడానికి దిల్ రాజు వేసిన ప్లాన్ అని ప్రొడ్యూసర్ గా ఓ సినిమా చేసేందుకు ముందస్తు ఏర్పాట్లలో ఇలా ఆఫర్ చేశాడని అనుకుంటున్న వారు లేకపోలేదు. అయినా రాజు గారు ప్రభాస్ తో ఇంతకు ముందే సినిమా చేశాడు. వంశీ పైడిపల్లిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తీసిన మున్నా ఫలితం సున్నా కొట్టింది కాని అప్పటి నుంచి ఇద్దరి మధ్యా బాండింగ్ బాగానే ఉంది. కాని ఎందుకనో మళ్ళి ఈ నిర్మాత హీరో కాంబినేషన్ సాధ్యపడలేదు.

ఒకపక్క మహేష్ లాంటి హీరోలు ఏరికోరి దిల్ రాజుని తమ సినిమా నిర్మాణంలో భాగస్వాములను చేస్తున్నారు. మరోవైపు ఈయన ఇతర హీరోల మీద సాహసానికి వెనుకాడటం లేదు. మొత్తానికి సాహో సెన్సేషన్స్ ఒక్కొక్కటిగా మొదలవుతున్నాయి. ఇతర ఏరియాలకు సైతం ఇదే తరహాలో నెవర్ బిఫోర్ డీల్స్ వస్తాయని ట్రేడ్ అంచనా

    

Tags:    

Similar News