ఎఫ్2 ఇచ్చిన వంద కోట్ల ఉత్సాహంతో దిల్ రాజు మాములు జోష్ లో లేరు. ఊహించిన దాని కన్నా ఐదారు రెట్లు ఎక్కవ విజయాన్ని సొంతం చేసుకోవడంతో గత ఏడాది చేదు జ్ఞాపకాలన్నీ పూర్తిగా మైండ్ లో నుంచి డిలీట్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. గత కొన్నేళ్ళుగా తన బ్యానర్ లో ఏ సినిమా తీసుకురానంత గొప్ప వసూళ్లు ఎఫ్2 కు రావడం పట్ల ఆయన ఆనందం మొహంలో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఫ్లోలో రాజు గారి చెబుతున్న కొన్ని మాటలు మాత్రం ఇపుడు చర్చకు దారి తీస్తున్నాయి.
ఇకపై తన సినిమాలకు సంబంధించిన కలెక్షన్ రిపోర్ట్స్ బ్రేక్ ఈవెన్ ఫిగర్స్ వగైరా వన్ని ఆయా థియేటర్లో డిస్ ప్లే లో వచ్చేలా చేస్తారట. సరే ఎఫ్2 బ్లాక్ బస్టర్ అయ్యింది కాబట్టి ఇలాంటివి చేసుకున్నా బాగుంటుంది. ఎంత పెద్ద నిర్మాత అయినా అన్ని సినిమాలకు ఇదే తరహ ఫలితం దక్కదు కదా. ఏదైనా యావరేజో లేక డిజాస్టర్ వచ్చినప్పుడు కూడా ఇలాగే ఇదుగో మా సినిమాకు డబ్బులు తక్కువగా వచ్చాయి చూడండి అంటూ డిస్ ప్లే పెడతారా. అసలు దీనికి సినిమా హాళ్ళ యజమానులు ఒప్పుకుంటారా అనేది చిక్కు ప్రశ్న. చెప్పడానికి వినడానికి ఇదంతా బాగానే ఉంది కాని కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమైన ఈ వసూళ్ళ గుట్టును బయట పెట్టుకోవడం అంత ఈజీ కాదు.
పైగా వంద సినిమాల్లో పదో పదిహేనో మాత్రమే హిట్టు కొడుతున్నాయి. అలాంటప్పుడు మిగిలిన వాటి గురించి థియేటర్లలో బోర్డులు పెట్టడం జరిగే పని కాదు. అయినా ఇదంతా విస్మరించి దిల్ రాజు ఇలా ప్రకటించేయడం ఆశ్చర్యకరమే. పైగా ఇందులో మరో చిక్కు ఉంది. ఇంత లెక్క వచ్చింది అని అధికారికంగా ప్రకటించుకుంటే ఐటి సమస్య వచ్చే అవకాశం లేకపోదు. మీరే చెప్పుకున్నారు కాబట్టి మొత్తం పన్నుకు లెక్క చూపండి అంటూ నిలదీసే హక్కు ఇచ్చినట్టు అవుతుంది. ఇవి కాకుండా ఇందులో బయటికి కనిపించని సమస్యలు ఎన్నో ఉన్నాయి. మరి అంత అనుభవం ఉన్న దిల్ రాజు గారు ఇలా కలెక్షన్లు ఇకపై థియేటర్ల దగ్గరే పెట్టేస్తాం అని చెప్పడంలో ఆంతర్యం ఏమిటో