టాలీవుడ్లో దిల్ రాజు మాటకు ఉన్న వాల్యూ ఏంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయన తమ సినిమా గురించి నాలుగు మంచి మాటలు చెబితే.. అదే పెద్ద సర్టిఫికెట్ లాగా భావిస్తారు వేరే చిత్రాల దర్శక నిర్మాతలు. ఆ మాటలు ఆ సినిమా ప్రమోషన్ కు ఎంత బాగా ఉపయోగపడతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ లేటెస్ట్ రిలీజ్ ‘ఆనందో బ్రహ్మ’ గురించి రాజు ఇలాగే మంచి మాటలు చెప్పాడు. ఈ సినిమా చూసి.. నచ్చి.. దిల్ రాజు ఆ చిత్ర సక్సెస్ మీట్ కు వచ్చి దాని గురించి పాజిటివ్ గా మాట్లాడటం విశేషం. ఈ సినిమాతో తనకేమీ సంబంధం లేకపోయినా దిల్ రాజు వచ్చి దాని గురించి మంచిగా మాట్లాడటం విశేషం.
‘ఆనందో బ్రహ్మ’ చూశాక తనకు కూడా హార్రర్ కామెడీ సినిమాలు నిర్మించాలన్న కోరిక కలిగిందని.. అంతగా తననీ సినిమా ఇన్ స్పైర్ చేసిందని రాజు చెప్పడం విశేషం. దయ్యాల్ని మనుషులే భయపడితే ఎలా ఉంటుందనే ఓ కొత్త ఆలోచనతో ‘ఆనందో బ్రహ్మ’ తీయడం బాగుందని.. ఇది హార్రర్ కామెడీ కాదని.. ‘రివర్స్ హార్రర్ కామెడీ’ అని.. ద్వితీయార్ధంలో శ్రీనివాసరెడ్డి.. వెన్నెల కిషోర్.. షకలక శంకర్.. తాగుబోతు రమేష్ ల మీద తీసిన సన్నివేశాలు చాలా బాగున్నాయని.. ఆ 40 నిమిషాల ఎపిసోడ్ ను తాను చాలా బాగా ఎంజాయ్ చేశానని రాజు తెలిపాడు. ‘ఆనందో బ్రహ్మ’ లాంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు బాగా ఆడినపుడే మరిన్ని మంచి సినిమాలు వస్తాయని రాజు అభిప్రాయపడ్డాడు.