యాక్షన్ సినిమాల దర్శకుడిగా గుర్తింపు దక్కించుకున్న బోయపాటి శ్రీను ప్రస్తుతం బాలకృష్ణ తో సినిమాను చేస్తున్నారు. వినయ విధేయ రామ సినిమా ఫ్లాప్ వల్ల చాలా విమర్శలు ఎదుర్కొన్న బోయపాటి ప్రస్తుతం చేస్తున్న బాలయ్య సినిమాను ఎట్టి పరిస్థితుల్లో సూపర్ హిట్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. బాలయ్యతో సినిమా ఫలితాన్ని బట్టి బోయపాటి తదుపరి సినిమా ఉంటుందని అంతా భావించారు. కాని బోయపాటి పై ఉన్న నమ్మకంతో దిల్ రాజు ఆయన తదుపరి సినిమాను తమ బ్యానర్ లో చేయించేందుకు గాను అడ్వాన్స్ ను కూడా ఇచ్చేశాడు.
దిల్ రాజు బ్యానర్ లోనే బోయపాటి దర్శకుడిగా కెరీర్ ఆరంభించారు. అందుకే మరోసారి దిల్ రాజు బ్యానర్ లో సినిమాను చేసేందుకు బోయపాటి ఓకే చెప్పి ఉంటారు. వచ్చే ఏడాది సమ్మర్ వరకు బోయపాటి ప్రస్తుతం చేస్తున్న బాలయ్య మూవీతో బిజీగా ఉంటారు. కనుక తదుపరి సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్థంలోనే ఉంటుంది. అంటే సినిమా వచ్చే ఏడాది ప్రారంభం అయ్యి 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ కాంబోలో నటించబోతున్న హీరో ఎవరు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. బాలయ్యతో మూవీ పూర్తి అయిన తర్వాత బోయపాటి రెడీ చేసిన కథను బట్టి హీరోను ఫైనల్ చేస్తారా లేదంటే ఇప్పటికే హీరో ఫైనల్ అయ్యాడా అనేది తెలియాలంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.