దిల్ రాజును మార్చేసిన ‘జవాన్’ టీం

Update: 2017-11-28 08:41 GMT
దిల్ రాజు ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బేనర్ మీద సినిమాలు తీయడంతో పాటు.. కొన్ని వేరే సినిమాలకు కూడా సమర్పణ చేశాడు. ఐతే వాటిలో చాలా వరకు ఆయనకు నిరాశనే మిగిల్చాయి. దీంతో ఆయన ఇకపై ‘దిల్ రాజు సమర్పించు’ అని ఏ సినిమాకూ వేసుకోకూడదని గట్టిగా నిర్ణయం తీసుకున్నాడట. తీస్తే తన బేనర్లో సినిమా తీయాలి తప్ప.. ఇంకే సినిమాలోనూ భాగస్వామి కాకూడదని నిర్ణయించుకున్నానని రాజు వెల్లడించాడు.

కానీ ‘జవాన్’ టీం మాత్రం తన ఒట్టు తీసి గట్టు పెట్టేలా చేసిందని రాజు తెలిపాడు. ఈ సినిమాలో భాగస్వామి అయిన హరీష్ శంకర్ కు ‘డీజే’ కన్ఫమ్ కావడంతో అతను బయటికొచ్చేసి.. తనను ఇందులో భాగస్వామిని చేశాడని రాజు తెలిపాడు. ఈ సినిమాకు పని చేసిన వాళ్లందరూ తనకు కావాల్సిన వాళ్లు కావడంతో ఈ ప్రాజెక్టును టేకప్ చేయక తప్పలేదని.. తన సొంత సినిమాకు ఎలా కేర్ తీసుకుంటానో దీనికి కూడా అలాగే జాగ్రత్త పడ్డానని రాజు వెల్లడించాడు.

కొన్ని నెలల కిందటే రిలీజ్ కావాల్సిన ‘జవాన్’ వాయిదా పడటానికి మధ్యలో జరిగిన మార్పులు చేర్పులే కారణమని రాజు వెల్లడించాడు. ఔట్ పుట్ చూసుకున్నాక 100 శాతం సంతృప్తి కలగలేదని.. ఏదో మిస్సయిన ఫీలింగ్ కలిగిందని.. దీంతో మళ్లీ అందరం కూర్చుని కొన్ని మార్పులు అనుకుని.. వాటి ప్రకారం షూటింగ్ చేశామని.. తర్వాత ఫస్ట్ కాపీ చూసుకుంటే పర్ఫెక్ట్ అనిపించిందని.. ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టబోతున్నామని రాజు ధీమాగా చెప్పాడు.
Tags:    

Similar News