అలాంటి టైటిళ్లతో దిల్ రాజుకు చెమట్లే

Update: 2017-10-24 17:30 GMT
ఆల్రెడీ మహేష్‌ బాబు కొత్త సినిమా కోసం రెండు టైటిళ్లను పరిశీలిస్తున్న మనం చెప్పుకున్నాం. మహేష్‌ బాబు ఒక్కడు సినిమాలోని సాంగ్ నుండి 'హరే రామ హరే కృష్ణ' అలాగే మరో సినిమా టైటిల్ కలిసేలా 'కృష్ణ ముకుందా మురారి' అనే టైటిళ్ళను దర్శకుడు వంశీ పైడిపల్లి అనుకుటున్నాడని టాక్. అయితే ఈ టైటిల్స్ అందరికీ నచ్చినా కూడా దిల్ రాజు మాత్రం ఒప్పుకోవట్లేదట. దానికో ఓ కారణం ఉందండోయ్.

ఇప్పటివరకు రాజు గారు నిర్మించిన కొన్ని సినిమాల్లో అసలు కంటెంట్ లేకుండా ఈ సినిమాలు ఎందుకు తీశాడో అనుకునే తరహాలో ఏదన్నా ఉందా.. ఓ మూడున్నాయి. విశేషం ఏంటంటే.. ఆ మూడింటి పేర్లు కూడా కనక్టింగ్ గా ఉంటాయి. 'రామ రామ కృష్ణ కృష్ణ' 'రామయ్య వస్తావయ్యా' 'కృష్ణాష్టమి'.. ఈ మూడు సినిమాలు కూడా రాజు గారి బ్యానర్ నుండి వచ్చిన సూపర్ డూపర్ డిజాష్టర్లు. అయితే ఈ టైటిల్స్ అన్నింటిలోనూ రాముడు లేకపోతే కృష్ణుడు ఉన్నాడు. ఇప్పుడేమో వంశీ పైడిపల్లి మరి అవే పేర్లతో సినిమా టైటిల్ పెడతానంటే.. రాజుగారికి చెమట్లు పట్టక ఏమవుతుంది.

అయితే సెంటిమెంట్ ను చూసుకుని ఆ టైటిల్స్ వద్దంటారో.. లేకపోతే కంటెంట్ ను నమ్ముకుని సెంటిమెంటును తుడిచేస్తాం అంటూ అవే టైటిళ్లకు మక్కువ చూపిస్తారా అనేది మాత్రం ఇంకా తెలియట్లేదు. ఈ సినిమా మహేష్‌ బాబు 25వ సినిమా కాబట్టి.. దిల్ రాజు కూడా ఆచితూచి టైటిల్ ను ఎన్నుకుంటారని తెలిసిందే.
Tags:    

Similar News