బుట్ట బొమ్మ అండ్ ఆఫ్ టైప్ కాదా!
అక్కడ కమిట్ అవుతూనే సౌత్ సినిమాలను బ్యాలెన్స్ చేసే కొత్త ప్రణాళికతో ముందుకెళ్తోంది.
ముంబై బ్యూటీ పూజాహెగ్డే మళ్లీ సౌత్ లో బిజీ అవుతోన్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ , టాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటూ బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నో ఆశలతో బాలీవుడ్ కి వెళ్లినా కలిసి రాలేదు. అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. అలాగని అమ్మడు హిందీ పరిశ్రమని వదిలేయలేదు. అక్కడ కమిట్ అవుతూనే సౌత్ సినిమాలను బ్యాలెన్స్ చేసే కొత్త ప్రణాళికతో ముందుకెళ్తోంది.
అయితే ఎవరికైనా సక్సెస్ లు వచ్చే కొద్ది ఒత్తిడి పెరుగుతుంది. తదుపరి చిత్రాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని...మరింత బాధ్యతగా పనిచేయాలని ఒత్తిడికి గురవుతుంటారు. కానీ పూజాహెగ్డే మాత్రం అలాంటి ఒత్తిడి ఏ సినిమాకి తీసుకోదుట. అలాగే పోషించిన పాత్రల విషయంలోనూ తొందరగా బయటకు రాలేదుట. ఆరకంగా రెండు రకాలుగా తాను స్విచ్ ఆన్ ఆఫ్ టైట్ కాదంటోంది.
సాధారణంగా హీరోయిన్లు ఒకేసారి నాలుగైదు సినిమాలు చేస్తుంటారు. దీనిలో భాగంగా రకరకాల పాత్రలు పోషిస్తుంటారు. ఒక్కోసారి ఒకే రోజు రెండు మూడు షూటింగ్ లకు కూడా హాజరవ్వాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో పాత్రల పరంగా కొంత కన్ప్యూజన్ కి గురయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి పాత్రలే మర్చిపోయే పరిస్థితి ఉంటుంది. కొంత మంది హీరోయిన్లు అయితే ఏ సినిమా షూటింగ్ కు వెళ్తున్నారో కూడా తెలియదు.
అంతటి పరజ్ఞానంలో షూటింగ్ లు చేస్తుంటారు. కానీ బుట్ట బొమ్మ ఆ టైపు కాదు. ఏ పాత్ర పోషించినా ఆ పాత్ర నుంచి త్వరగా బయటకు రాలేదుట. ఆ పాత్రలను మనసులో బలంగా పెన వేసుకుందిట. అందుకు కారణం. కమిట్ అయిన పాత్ర విషయంలో అంత స్ట్రాంగ్ గా లేకపోతే నూరుశాతం ఎఫెర్ట్ పెట్టి సెట్స్ లో పని చేయలేమంటోంది. చూసారా బుట్టబొమ్మ సినిమాలంటే ఎంత ఫ్యాషన్ తో పనిచేస్తోందో.