సో క్యూట్: తన హీరోకి తెలుగు నేర్పించిన రష్మిక
చారిత్రక కథాంశంతో రూపొందించిన ఈ సినిమాని హిందీ- తెలుగు సహా దక్షిణాది భాషల్లో విడుదల చేస్తుండగా, రష్మిక- విక్కీ టీమ్ ప్రచారంతో అదరగొడుతోంది.
గత కొంతకాలంగా రష్మిక మందన్న- విక్కీ కౌశల్ జంట చావా ప్రమోషన్లలో సందడి చేస్తోంది. చారిత్రక కథాంశంతో రూపొందించిన ఈ సినిమాని హిందీ- తెలుగు సహా దక్షిణాది భాషల్లో విడుదల చేస్తుండగా, రష్మిక- విక్కీ టీమ్ ప్రచారంతో అదరగొడుతోంది.
ఇంతకుముందు ముంబై టు హైదరాబాద్ ప్రయాణిస్తూ కాలి గాయం కారణంగా వీల్ చైర్ లోనే కనిపించిన రష్మికకు వేదికలపై సహాయం చేస్తూ కనిపించాడు విక్కీ. నడవలేని స్థితిలో కష్టంలో ఉన్న సహచరికి అతడి సహాయం హృదయాలను గెలుచుకుంది. అంత పెద్ద హీరో ఎంతో ఒదిగి ఉండే స్వభావంతో ఆకట్టుకున్నాడు. విక్కీ వైఖరికి అభిమానులు పెరిగారు.
తాజాగా హైదరాబాద్ ప్రమోషన్స్ లోను విక్కీ కౌశల్ తన డౌన్ టు ఎర్త్ నేచుర్ తో ఆకట్టుకున్నాడు. వీల్ చైర్‌లో ఉన్న రష్మికకు అతడు సహాయం చేసాడు. అలాగే తెలుగు మాట్లాడేందుకు ప్రయత్నించాడు. హిందీ హీరోకి తెలుగు మాట్లాడేందుకు రష్మిక సహాయం చేసింది. రష్మిక మందన్న ఒక్కో తెలుగు పదం చెబుతుంటే, దానిని యథాతథంగా మాట్లాడేందుకు ప్రయత్నించాడు విక్కీ. ఈ దృశ్యం చూపరుల హృదయాలను గెలుచుకుంది. ఇది సో క్యూట్ అంటూ అందరూ ప్రశంసిస్తున్నారు.
విక్కీ కౌశల్ ముందుగా 'అందరికీ నమస్కారం' అంటూ విష్ చేసాడు. అందరూ బాగున్నారా? అని కూడా తెలుగులోనే పలకరించాడు. హైదరాబాద్ కి రావడం చాలా సంతోషంగా ఉంది..మీరంతా ఫిబ్రవరి 14న థియేటర్లకు వచ్చి 'చావా' సినిమా చూడండి.. సపోర్ట్ చేయండి.. అని కూడా కోరాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందించిన చావా అత్యంత భారీగా విడుదల కానుంది.