సినిమా సినిమాకూ వైవిధ్యం చూపించేవాడు కాబట్టే.. ఒకప్పుడు కృష్ణవంశీని అందరూ క్రియేటివ్ డైరెక్టర్ అనేవాళ్లు. కానీ ‘మురారి’ దగ్గర్నుంచి ఒక తరహా ఫ్యామిలీ టైపు సినిమాలే చేస్తూ రావడంతో జనాలకు మొనాటనీ వచ్చేసింది. ‘మొగుడు’ ఆయన కెరీర్ ను చాలా చాలా దెబ్బ తీసింది. ‘గోవిందుడు అందరివాడేలే’తో మళ్లీ ఉనికిని చాటుకున్నప్పటికీ.. అది కృష్ణవంశీ లాంటి డైరెక్టర్ తీయాల్సిన సినిమా అయితే కాదు. ఐతే కృష్ణవంశీ ఇప్పుడు మళ్లీ తనేంటో రుజువు చేసుకోవాలని పట్టుదలగానే ఉన్నట్లున్నాడు. దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్ ను మెప్పించి భారీ బడ్జెట్ సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తున్నాడంటే.. కృష్ణవంశీ ఈసారి తన ముద్ర చూపిస్తాడనే అనుకోవచ్చు.
తన కొత్త సినిమా ‘కృష్ణాష్టమి’ రిలీజ్ నేపథ్యంలో ఇంటర్వ్యూలిస్తూ.. కృష్ణవంశీ సినిమా విశేషాలు చెప్పాడు రాజు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుందని.. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తామని.. తర్వాత హిందీలోకి కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తామని వెల్లడించాడు రాజు. ఇదొక విజువల్ వండర్ అని, కృష్ణవంశీ అంటే ఏంటో చూపిస్తుందని రాజు చెప్పాడు. ‘రుద్రాక్ష’ అని టైటిల్ వినిపిస్తున్నప్పటికీ.. ఇంకా టైటిల్ ఏమీ ఫైనలైజ్ చేయలేదని రాజు చెప్పాడు. సినిమాలో 40 నిమిషాలకు పైగా గ్రాఫిక్స్ ఉంటాయని కూడా రాజు తెలిపాడు. ఈ సినిమాలో అనుష్క - సమంత - రమ్యకృష్ణ ముఖ్య పాత్రలు పోషించబోతుండటం విశేషం. దీని బడ్జెట్ రూ.30 కోట్లకు పైనే అంటున్నారు