మరో ఇరవై రోజుల్లో విడుదల కానున్న శ్రీనివాస కళ్యాణం ఫలితం మీద నిర్మాత దిల్ రాజు చాలా నమ్మకంతో ఉన్నాడు. ఈ ఏడాది ఈయన నిర్మాణంలో వస్తున్న రెండో సినిమా ఇదే. గత సంవత్సరం తన బ్యానర్ పై ఏకంగా 6 సినిమాలు విడుదల చేసి రికార్డు సెట్ చేసిన ఈయన ఈసారి మాత్రం కొద్దిగా స్లో అయ్యారు. లవర్ ఆశించిన ఫలితం ఇవ్వనప్పటికీ శ్రీనివాస కళ్యాణం గట్టిగా సపోర్ట్ చేసేలా ఉంది. ఇప్పటికే టీజర్ ఆడియో అంచనాలు పెంచేయగా నిన్న జరిగిన వేడుక ఈ మధ్య కాలంలో జరగని కొత్త రీతిలో జరపడంతో హైప్ ఇంకా పెరిగిపోయింది. ఆ సందర్భంగా మాట్లాడిన దిల్ రాజు తో సహా అందులో నటించినవారు కూడా ఎమోషనల్ కావడం విశేషం. తన జీవితంలో జరిగిన ఘట్టాలనే సినిమాలో చూసుకోవడం ప్రతి ప్రేక్షకుడు తన కథగా ఫీలయ్యేలా చేస్తుందని అంతబాగా సతీష్ దీన్ని తెరకెక్కించాడని చెప్పారు. కూతురి పెళ్లి జరగడం మనవడు పుట్టిన వేళా విశేషం భార్య దూరమైనప్పుడు కలిగిన క్షోభ ఇలాంటివన్నీ ఇందులో చూసి తమ ఇంట్లో కూడా ఏదో పెళ్లి జరుగుతోందన్న ఫీలింగ్ చూసినవాళ్లకు కూడా కలుగుతుందని చెప్పడం ఆకట్టుకుంది.
యుగాలలో త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం అంటూ ఎన్ని మార్పులు జరిగినా దేవుడే స్వయంగా మనిషి అవతారం ఎత్తినా పెల్లికున్న గొప్పదనం ప్రాముఖ్యత మాత్రం తగ్గలేదని దానికి ఉదాహరణగా ఇప్పటికీ సంప్రదాయాలను పాటించడమే అని దిల్ రాజు చెప్పారు. రాశి ఖన్నా-ప్రకాష్ రాజ్-రాజేంద్ర ప్రసాద్ ఇలా ఇందులో నటించిన వాళ్ళందరూ ఈ శ్రీనివాస కళ్యాణంని మనసు లోతుల్లోకి తీసుకున్నారు కాబట్టే వాళ్ళ మాటల్లో నిజాయితీ ఉందని చెప్పిన దిల్ రాజు ఫామిలీ ప్రేక్షకులను ఎక్కడ టచ్ చేయాలో సరిగా వాటి గురించే మాట్లాడి సినిమా మీద అంచనాలు ఇంకా పెంచేసుకున్నారు. నితిన్ రాశి ఖన్నా జంటగా నటిస్తున్న ఈ మూవీ ఆగస్ట్ 9 విడుదల చేసేందుకు అన్ని సిద్ధం చేసేసారు. కుటుంబ కథా చిత్రాల్లో భారీ విడుదల నోచుకునే సినిమాగా కూడా శ్రీనివాస కళ్యాణం కొత్త ట్రెండ్ సెట్ చేసేలా ఉంది.