ఆల్రెడీ దిల్ రాజు ఆఫీస్ దగ్గర మెగా ఫ్యాన్స్ గోల చేశారంటూ చాలా వార్తలు వచ్చేశాయి. అయితే అవన్నీ నిజమా కాదా అంటూ సినిమా లవర్స్ అందరూ ఆలోచనలో పడిన క్రమంలో.. అవన్నీ నిజమే అన్నట్లు నిర్మాత దిల్ రాజు స్పందించిడం విశేషం. అయితే ఈ కలక్షన్ల పైటింగ్ గురించి పెద్దగా మాట్లాడలేదు కాని.. మెగాస్టార్ చిరంజీవి గురించి నాలుగు మాటలు చెప్పి.. ఆయనకు ఎవరుసాటి కాదు అంటూ ఫ్యాన్స్ ను శాంతింపజేసే ప్రయత్నం చేశారు.
''వరుణ్ తేజ్ గురించి మాట్లాడాలంటే.. ముందుగా నేను మాట్లాడాల్సిన ఓన్లీ వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. మొదటిసారి చిరంజీవిగారిని స్టేట్ రౌడీ షూటింగులో ప్యారడైజ్ హోటల్ దగ్గర ఆయన్ను చూశాను. తరువాత అల్లుడా మజాకా సినిమా డిస్ర్టిబ్యూటర్ గా ఆయన దగ్గర నుండి షీల్డ్ తీసుకున్నాను. తరువాత ఆర్య కథను సుకుమార్ ఆయనకు చెబుతున్నప్పుడు 2 గంటల పాటు రూమ్ బయటే వెయిట్ చేశాను. అలా ఆయనతో ఎన్నో మూమెంట్స్ ఉన్నాయి. ఇక చిరంజీవి గారు ఉన్నారు కాబట్టే.. ఆయన తరువాత పవన్ కళ్యాణ్ గారు.. అర్జున్.. చరణ్.. వరుణ్.. సాయిధరమ్ తేజ్.. ఇలా అందరూ వచ్చారు. ఆయన వలనే అందరూ ఎదిగారు. ఇంతమంది హీరోలను ఇండస్ర్టీకి ఇచ్చినందుకు చిరంజీవిగారికి థ్యాంక్స్ చెప్పాలి'' అంటూ దిల్ రాజు చెప్పడంతో.. హర్టయిన మెగా ఫ్యాన్స్ ను ఆయన సముదాయిస్తున్నారు అనే ఫీలింగ్ వచ్చింది.
ఆఖరిగా.. చిరంజీవి టాపిక్ ను క్లోజ్ చేస్తూ.. ''నా ఎన్నో సినిమాలకు చిరంజీవిగారు వచ్చారు.. ఆయన సినిమాకు ఇచ్చే విలువ ఎంతో గొప్పది. పోతే ఈ మధ్యన సోషల్ మీడియాలో చూస్తున్నాను.. ఖైదీ నెం 150 సినిమాకు డిజె దువ్వాడ జగన్నాథమ్ సినిమాకు ఏవో పోలికలు కావాలనే రాస్తున్నారు. కాని అది చిరంజీవిగారి సినిమా. స్పెషల్ ఫిలిం. ఎప్పుడు ఆయన రేంజ్ పైనే. ఆ సినిమాతో పోలికలు ఏవీ లేవు'' అంటూ వివరణ ఇచ్చారు. మరి ఇప్పటికైనా హర్టయిన మెగా ఫ్యాన్స్ శాంతిస్తారా?