700 థియేట‌ర్ల‌ను న‌లుగురికీ పంచేశాడు

Update: 2016-01-07 07:30 GMT
నైజాం డిస్ర్టిబ్యూష‌న్‌ లో కింగ్ ఆఫ్ ది కింగ్  ఎవ‌రంటే ఎవ‌రైనా ఏ పేరు చెబుతారు. ఏమాత్రం త‌డుముకోకుండా దిల్‌ రాజు పేరు చెప్పేస్తారు. స్టార్ ప్రొడ్యూస‌ర్‌ గా - స్టార్ డిస్ర్టిబ్యూట‌ర్‌ గా నైజాంలో చ‌క్రం తిప్పుతున్నాడు అత‌డు. స్టార్ హీరోలంద‌రితో స‌త్సంబంధాలున్నాయి. అంద‌రికీ స‌న్నిహితుడు - మిత్రుడు - ఆప్తుడు. ఏ కోణంలో చూసినా దిల్‌ రాజు ది గ్రేట్‌. అందుకే ఈ సంక్రాంతి బ‌రిలో రిలీజ్‌ కి వ‌స్తున్న నాలుగు సినిమాల విష‌యంలో అత‌డు ఓ ఇంట్రెస్టింగ్ టాస్క్‌ ని ప్లాన్ చేశాడు. క‌ర‌వ‌మంటే క‌ప్ప‌కు కోపం - విడ‌వ‌మంటే పాముకు కోపం అన్న చందంగా ప‌రిస్థితి మార‌కుండా .. హీరోల‌కు ముకుతాడు వేసేశాడు. అదెలాగంటే..

వాస్త‌వానికి ఈ సంక్రాంతికి రిలీజ‌వుతున్న ఐదారు ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రాల్లో ఎక్స్‌ ప్రెస్‌ రాజా త‌న వోన్ రిలీజ్ మూవీ. త‌నే డిస్ర్టిబ్యూష‌న్ హ‌క్కుల్ని కొనేశాడు. కాబ‌ట్టి నైజాంలో మెజారిటీ భాగం థియేట‌ర్ల‌లో ఈ సినిమా రిలీజ‌వుతుంద‌ని అంతా అనుకున్నారు. అయితే దిల్‌ రాజు ఆలోచ‌నే వేరుగా ఉంది. అత‌డికి సొంత బిజినెస్ కంటే అంద‌రు  హీరోల‌తో స‌త్యంబంధాలు ముఖ్యం. అందుకే సంక్రాంతి రేసులో ఉన్న డిక్టేట‌ర్‌ - నాన్న‌కు ప్రేమ‌తో - సోగ్గాడే చిన్నినాయ‌నా - ఎక్స్‌ప్రెస్ రాజా(త‌నది) సినిమాల‌కు ఈక్వ‌ల్‌ గా థియేట‌ర్ల‌ను పంచేశాడుట‌.

రాజుగారికి నైజాంలో 700 పైగా సొంత థియేట‌ర్లు ఉన్నాయ్‌. వీట‌న్నిటినీ నాలుగు స‌మ‌భాగాలు చేసి న‌లుగురికి పంచేశాడుట‌. బాల‌య్య‌ను ఎదురించ‌లేదు. ఎన్టీఆర్‌ తో త‌దుప‌రి సినిమా చేయాలి. నాగార్జున జిగిరీ దోస్త్‌ - శ‌ర్వానంద్‌ కి ప‌ర్స‌న‌ల్ డిస్ర్టిబ్యూట‌ర్‌.. అందుకే ఇంత జాగ్ర‌త్త‌గా తెలివిగా అడుగులేశారు రాజుగారు. అర్థ‌మైంది క‌దూ?
Tags:    

Similar News