కరోనా కారణంగా ఓటీటీ ప్రధాన్యం పెరిగింది. థియేటర్లు ఓపెన్ కాకపోవడంతో రిలీజ్ కి రెడీగా వున్న సినిమాలన్నీ మరో ఛాన్స్ లేకపోవడంతో డైరెక్ట్ గా ఓటీటీలలో రిలీజ్ అయ్యాయి. అక్కడ వాటికి ఆదరణ లభించడంతో చాలా మంది తెలుగు ప్రేక్షకులు ఓటీటీలపై ఆసక్తిని చూపించడం మొదలుపెట్టారు. ప్రేక్షకులు ఓటీటీలకు అడిక్ట్ అయినట్టుగానే స్టార్ ప్రొడ్యూసర్లు కూడా ఓటీటీలకు అడిక్ట్ అయిపోతున్నారా? అను అనుమానాలు కలుగుతున్నాయి.
కారణం ఇప్పటికే `బాహుబలి` ప్రొడ్యూసర్స్ సినిమాలు తీయడం మానేసి ఓటీటీల కోసం వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఇప్పటికే `పరంపర` వెబ్ సిరీస్ ని రిలీజ్ చేసిన ఈ మేకర్స్ రీసెంట్ గా దీనికి సీక్వెల్ గా `పరంపర 2` ని విడుదల చేశారు. ప్రస్తుతం ఇది డిస్నీప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదిలా వుంటే మరో స్టార్ ప్రొడ్యూసర్ కూడా ఓటీటీలకు కంటెంట్ ని ఇవ్వడానికి రెడీ అవుతున్నారట. ఇందు కోసం స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది.
టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా పేరు తెచ్చుకున్న దిల్ రాజు ఓటీటీ కంటెంట్ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ - శంకర్ లతో భారీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు. మరో పక్క తమిళ స్టార్ హీరో విజయ్ తో వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెలుగు, తమిళ భాషల్లో భారీ ప్రాజెక్ట్ గా `వారసుడు` చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంతే కాకుండా హిందీలో `హిట్` మూవీని నిర్మిస్తూ అక్కడ కూడా పాగా వేయాలని ప్లాన్ చేస్తున్నారు.
క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా వుంది కూడా ఓటీటీ ల కోసం వెబ్ సిరీస్ లు నిర్మించాలనే ఆలోచనలో వున్నారట. బాలీవుడ్ తో పాటు తెలుగులోనూ ఓటీటీల కోసం వెబ్ సిరీస్ లని చేయాలని ప్లాన్ చేస్తున్నారట. బిగ్ స్టార్స్ తో సినిమాలు చేయడం వల్ల భారీ స్థాయిలో పారితోషికాలు ఇవ్వాల్సి వస్తోందని, దీనికంటే ఓటీటీలకు తక్కవ బడ్జెట్ లో వెబ్ సిరీస్లు వెబ్ మూవీస్ ని అందించడం చాలా ఈజీ అని ఇందు కోసం ప్రత్యేక ప్రణాళికలో వెబ్ కంటెంట్ ని అందించాలని ఆలోచిస్తున్నారట.