శంకర్ సినిమా అంటే భారీతనం. సౌత్ లో ఇప్పుడే కాదు ఒకప్పుడు కూడా భారీగా ఖర్చు చేసి సినిమాలు తీసిన ఘనత శంకర్ కు దక్కుతుంది. ఇండియాలోనే అప్పట్లో అత్యధిక బడ్జెట్ తో సినిమాలు తీసిన ఘనత ఆయనకే దక్కుతుంది. అలాంటి ఘన కీర్తిని దక్కించుకున్న శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా అంటే ఎలా ఉంటుంది. సహజంగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగానే సినిమాను భారీ గా ఖర్చు చేసి దిల్ రాజు నిర్మిస్తున్నాడు. శంకర్ సినిమాకు దిల్ రాజు పెట్టే ఖర్చు శాంపిల్ అన్నట్లుగా తాజాగా ఓపెనింగ్ కోసమే భారీగా ఖర్చు చేయడం జరిగింది. శంకర్ మరియు రామ్ చరణ్ ల కాంబోలో రూపొందుతున్న సినిమా దిల్ రాజు బ్యానర్ లో 50వ సినిమాగా రూపొందుతుంది. అందుకే ఈ సినిమా కోసం ఖర్చు విషయంలో వెనకాడకుండా చేస్తున్నాడని తాజాగా ఓపెనింగ్ కార్యక్రమంతో వెళ్లడయ్యింది.
బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ ప్రత్యేక అతిథిగా హాజరు అయిన ఈ సినిమా ప్రారంభోత్సవం కోసం తమిళనాడు నుండి కూడా పలువురు హాజరు అయ్యారు. ఈ సినిమా ప్రారంభోత్సవం కోసం హైదరాబాద్ కు ముందు రోజే సెలబ్రెటీలు చేరుకున్నారు. వారి కోసం వారి హోదాను బట్టి స్టార్ హోటల్స్ ను దిల్ రాజు బుక్ చేశారు. అంతే కాకుండా వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయించారు. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ ప్రారంభోత్సవ సెట్టింగ్ ఏర్పాట్లు అన్నింటికి కూడా భారీగా ఖర్చు అయ్యిందట. దిల్ రాజు ఆఫీస్ వర్గాల వారు అనుకుంటున్న దాని ప్రకారం షూటింగ్ ప్రారంభం అయిన రోజు ఉదయం వి కమింగ్ అనే పోస్టర్ కోసం చాలా ఖర్చు చేశారట. నటీనటులు మరియు టెక్నీషియన్స్ అంతా కూడా సూటు తో రెడీ అయ్యారు. వారందరికి కూడా సూటు ఏర్పాటు చేయడంతో పాటు ఫొటో షూట్ చేయించారు. అది కాస్త సమయం తీసుకోవడంతో పాటు డబ్బు కూడా ఖర్చు అయ్యిందట. షూటింగ్ ప్రారంబోత్సవ ఖర్చు.. సెలబ్రెటీల ట్రాన్స్ పోర్ట్ మరియు హోటల్స్ బిల్లులు ఇంకా ఇతర ఖర్చులు మరియు పోస్టర్ కోసం చేసిన ఖర్చులు అన్ని కలిపి ఖచ్చితంగా కోటి రూపాయలకు ఎక్కువే అయ్యాయి అనేది టాక్.
దిల్ రాజు ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు కనుక ఈ ఖర్చుకు వెనుకాడలేదు. ముందు ముందు కూడా శంకర్ కు పూర్తిగా స్వేచ్చ ఇచ్చి సినిమా నిర్మాణంకు సహకరించేలా ఒప్పందం జరిగినట్లుగా తెలుస్తోంది. ఖర్చు విషయంలో వెనుకాడకుండా దిల్ రాజు పెట్టేందుకు సిద్దం కాని వచ్చే ఏడాది చివరి వరకు సినిమా షూటింగ్ ముగించాలని ఒప్పందం చేసుకున్నట్లుగా మీడియా వర్గాల టాక్. మొత్తానికి ఆర్ సీ 15 సినిమా హైప్ మామూలుగా లేదు. దిల్ రాజు పెట్టిన ఖర్చుకు డబుల్ హైప్ ప్రారంభోత్సవంతోనే క్రియేట్ అయ్యింది. కను ఖచ్చితంగా సినిమా మరో లెవల్ లో ఉంటుంది అనే నమ్మకం వ్యక్తం అవుతోంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి కీలక పాత్రలో కనిపించబోతుంది. సునీల్ కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. థమన్ సంగీతాన్నిఅందించనుండగా జానీ మాస్టర్ చరణ్ తో చెప్పులు వేయించబోతున్నాడు.