భీమ్లాని ఆ పెద్ద మ‌నిషి క‌న్విన్స్ చేయ‌గ‌ల‌రా?

Update: 2021-11-17 17:30 GMT
2022 సంక్రాంతి బ‌రిలో రిలీజ్ కి సిద్ధ‌మ‌వుతున్నాడు భీమ్లా నాయక్. ఇప్ప‌టికే రిలీజ్ తేదీని ప్ర‌క‌టించి థియేట‌ర్ల వేట‌ను సాగిస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాని వాయిదా వేసుకోవాల్సిందిగా ఇత‌ర నిర్మాత‌లు కోరుతున్నారు. ఇదే సంక్రాంతి సీజ‌న్ లో ఆర్.ఆర్.ఆర్ స‌హా రాధేశ్యామ్ లాంటి పాన్ ఇండియా చిత్రాలు థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతుండ‌గా భీమ్లా నాయ‌క్ వెన‌క్కి త‌గ్గ‌క‌పోవ‌డం పెద్ద స‌మ‌స్య‌గా మారుతోంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

థియేట‌ర్ల స‌ర్ధుబాటు అనేది అంద‌రికీ పెద్ద‌ స‌మ‌స్య‌. థియేట‌ర్ల షేరింగ్ వ‌ల‌న రెవెన్యూ లాస్ త‌ప్ప‌దు. అందుకే ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు మెగాస్టార్ చిరంజీవి బ‌రిలో దిగుతున్నార‌ని గుస‌గుస‌లు వినిపించాయి. త‌మ్ముడు ప‌వ‌న్ ని చిరు ఒప్పిస్తార‌ని ఇంత‌కుముందు టాక్ వినిపించింది. తాజాగా అగ్ర నిర్మాత‌.. ప్ర‌ముఖ పంపిణీదారుడు దిల్ రాజు బ‌రిలో దిగార‌నేది మ‌రో గుస‌గుస‌.

ఆయ‌న ఏదోలా ప‌వ‌న్ టీమ్ ని ఒప్పించేందుకు త‌న‌వంతుగా ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌. ముక్కోణ‌పు పోటీ వ‌ల్ల అంద‌రూ న‌ష్ట‌పోవాల్సొస్తుంద‌ని .. భీమ్లాకి కూడా ఇది పెద్ద న‌ష్టం క‌లిగిస్తుంద‌ని విన్న‌వించ‌నున్నార‌ట‌.  దీనిపై యాక్టీవ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ లోనూ చ‌ర్చించ‌నున్నార‌ట‌. రిలీజ్ తేదీ మార్చాల్సిందిగా ప‌వ‌న్ టీమ్ ని కొర‌తార‌ని తెలుస్తోంది. అయితే సోలో రిలీజ్ కి రావ‌డం కంటే ఆర్.ఆర్.ఆర్ లాంటి పెద్ద సినిమాతో వ‌స్తేనే త‌మ‌కు సేఫ్ అని భీమ్లా టీమ్ భావిస్తున్న‌ట్టు మ‌రో గుస‌గుస వినిపించింది. ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం నుంచి స‌మ‌స్య రాకుండా ఉండాలంటే సంక్రాంతి రిలీజ్ బెట‌ర‌ని భావిస్తున్న‌ట్టు టాక్ బ‌య‌ట‌కొచ్చింది. కానీ పెద్ద‌లు భీమ్లాని ఎలా ఒప్పించ‌బోతున్నారో వేచి చూడాల్సి ఉంది.
Tags:    

Similar News