పటాస్’ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు అనీల్ రావిపూడి. కళ్యాణ్ రామ్ కు చాలా కాలంకు ఒక సక్సెస్ ను ఇచ్చిన అనీల్ రావిపూడి ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. ఆ సమయంలోనే అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు బాలకృష్ణ ఓకే చెప్పాడు అంటూ వార్తలు వచ్చాయి. బాలకృష్ణ వందవ సినిమాకు అనీల్ రావిపూడి దర్శకత్వం వహించబోతున్నట్లుగా కూడా పుకార్లు షికార్లు చేశాయి. అయితే వందవ సినిమాను క్రిష్ దర్శకత్వంలో బాలయ్య చేశాడు. బాలయ్య వందవ సినిమాతో బిజీ అయిన సమయంలోనే అనీల్ రావిపూడి ఇతర సినిమాలతో వరుసగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎట్టకేలకు వీరిద్దరి కాంబోలో మూవీ పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది.
ప్రస్తుతం బాలయ్య ‘ఎన్టీఆర్’ చిత్రం పనుల్లో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ రెండు పార్ట్ లు కూడా విడుదలైన తర్వాత బాలయ్య తదుపరి చిత్రాన్ని అనీల్ రావిపూడి దర్శకత్వంలో చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. తాజాగా ‘ఎఫ్ 2’ చిత్రంను తెరకెక్కించి ఆ సినిమా విడుదల పనుల్లో అనీల్ బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత బాలయ్యతో మూవీ ఉంటుందని తెలుస్తోంది. గతంలో బాలయ్య వద్దకు అనీల్ రావిపూడిని దిల్ రాజు తీసుకు వెళ్లాడు. అప్పట్లో వీరిద్దరి కాంబో మూవీ ఓకే అయితే దిల్ రాజు ఆ సినిమాను నిర్మించేవాడు. కాని అప్పుడు అది పట్టాలెక్కలేదు.
ఇప్పుడు అనీల్ రావిపూడికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దాంతో దిల్ రాజు నిర్మాణంలోనే ఆ సినిమాను చేయాలని దర్శకుడు అనీల్ భావిస్తున్నాడట. కాని బాలయ్య మాత్రం తన ఎన్ బి కే ప్రొడక్షన్స్ లోనే ఇకపై తాను చేసే సినిమాలన్నీ నిర్మించాలని భావిస్తున్నాడట. ఈ నేపథ్యంలో దిల్ రాజుకు బాలయ్య ఛాన్స్ ఇచ్చేనా లేదా అనే విషయంపై చర్చ జరుగుతోంది. దిల్ రాజుతో కలిసి బాలయ్య ఈ సినిమాను నిర్మించే అవకాశాలు కూడా లేక పోలేదు. ఈ విషయమై క్లారిటీ రావాలి అంటే మరో రెండు మూడు నెలలు వెయిట్ చేయాల్సిందే.
Full View