గోపాల్ కృష్ణన్ పద్మనాభన్ పిళ్లై అంటే కేరళలోనే గుర్తు పట్టలేదు. అలాంటిది మిగిలిన రాష్ట్రాల్లో ఆ పేరు చెప్పిన వెంటనే గుర్తించే ఛాన్సే లేదు. కానీ.. హీరో దిలీప్ కుమార్ అన్న వెంటనే గుర్తుకు వచ్చేస్తారు. నిజానికి తన పూర్తి పేరును తాను గుర్తు పెట్టుకున్నదే లేదని దిలీప్ చెబుతుంటారు. చాలాసార్లు తన పూర్తి పేరును గుర్తు చేస్తే తన పేరేనా? అన్న భావన కలుగుతుందన్న విషయాన్ని ఆయన అప్పుడప్పుడు సరదాగా చెబుతుంటారు.
పీపుల్స్ హీరో అన్న వెంటనే సినీ అభిమానులకు దిలీప్ గుర్తుకు వస్తారు. కళాభవన్ బృందం నుంచి వచ్చిన సాదాసీదా మిమిక్రీ ఆర్టిస్ట్ తర్వాతి దశలో ఆయన ప్రముఖ హీరో స్థాయికి ఎదిగారు. మలయాళ సినీ రంగంలో మమ్ముట్టి.. మోహన్ లాల్ తర్వాత మూడో అతి పెద్ద నటుడిగా దిలీప్ కు పేరుంది .
ప్రముఖ మలయాళ దర్శకుడు కమల్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ చేసిన దిలీప్ చిన్న చిన్న వేషాలు వేశారు. దాదాపు 23 ఏళ్ల క్రితం తొలిసారి హీరో పాత్రను మన్నాదే కొట్టారమ్ లో పోషించారు. ఆ చిత్రంలో ఆయన పోషించిన పాత్ర పేరు దిలీప్. అదే.. ఆయన అసలు పేరుగా మారిపోయింది. కథానాయకుడిగా అలా జర్నీ స్టార్ట్ చేసిన దిలీప్ తర్వాతి రోజుల్లో బాగానే పాపులర్ అయ్యారు. సల్లాపం సినిమాతో ఆయనకు మరింత పేరు వచ్చింది. ఆ సినిమాలో తనతో హీరోయిన్ గా నటించిన మంజూతో ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకున్నారు.
ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్లు.. లవ్ యాంగిల్ తో పాటు పలు హాస్య చిత్రాల్లో నటించిన దిలీప్ క్రమక్రమంగా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. నటుడిగానే మిగిలిపోకుండా తనదైన శైలిలో తనను తాను విస్తరించుకుంటూ పోయారు. నిర్మాతగా.. డిస్ట్రిబ్యూటర్ గా.. రియల్ ఎస్టేట్.. హోటల్ తో పాటు పలు వ్యాపారాల్లోకి వెళ్లారు.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ పక్షాన ట్వంటీ ట్వంటీ అనే మల్టీ స్టారర్ మూవీని నిర్మించి.. ఆర్థిక ఇబ్బందుల నుంచి గటెక్కించిందీ దిలీపే. ఇది ఆయనలో ఒక కోణం. ఇలాంటి ఉదంతాల్లో హీరోగా కనిపించే ఆయనలో మరో కోణం ఉంది. అది విలన్. ఆయనతో పెట్టుకున్న వారి కెరీర్ అంతం చేసేవరకూ నిద్రపోని తీరు ఆయనకు ఎక్కువని చెబుతారు. తనతో పేచీ పెట్టుకున్న ప్రముఖ దర్శకుడు వినయ్ కు అవకాశాలు రాకుండా చేయటంలోనూ.. సీనియర్ నటుడు దివంగత తిలకన్ కూ కూడా చివరి రోజుల్లో అవకాశాలు లేకుండా చేయటంలో దిలీప్ కీలక భూమిక పోషించినట్లు చెబుతారు.
ఆయనత గొడవ పడిన నేరానికి.. ఇటీవల కిడ్నాప్ కు ఆ పై లైంగిక దాడికి గురైన హీరోయిన్ కు అవకాశాలు తగ్గటానికి కారణమయ్యాయని చెబుతారు. కొన్నాళ్లుగా వరుస ప్లాపులతో దిలీప్ ప్రాభవం తగ్గినప్పటికీ ఇండస్ట్రీలో ఆయన కు పట్టు పోలేదని చెబుతారు. గత ఏడాది ఆయన నటించిన చివరి చిత్రం సెంట్రల్ జైల్ విడుదలైంది. చివరకు ఇప్పుడాయన చేసిన తప్పులకు జెల్లో ఉండటం యాదృచ్ఛికమేనని చెప్పక తప్పదు.