బాలీవుడ్ లో అందరి కళ్లు ఇప్పుడు రెండు సినిమాల మీదే ఉన్నాయి. ఇద్దరు స్టార్ హీరోలు నటించిన రెండు సినిమాలు రేపు దేశవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతుండడంతో ఈ రెండు సినిమాల్లో ఏది పైచేయి సాధిస్తుందోనని ఎవరి లెక్కల్లో వారు మునిగి తేలుతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ ను దిల్ వాలే - బాజీరావు మస్తానీ సినిమాల ఫీవర్ ఓ ఊపు ఊపుతోంది. బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా ఇద్దరు పెద్ద హీరోలు నటించిన సినిమాలు ఒకేసారి విడుదల అవుతుంటే ఆ ఉత్కంఠ మామూలుగా ఉండదు. బాలీవుడ్ లో డిసెంబర్ 18 టెన్షన్ పట్టుకుంది. రెండు పెద్ద సినిమాలు, మంచి స్టార్ కాస్ట్ ఉన్న సినిమాలు కావడంతో టోటల్ సినిమా ఇండస్ట్రీ ఇండస్ట్రీ ఈ సినిమాల రిజల్ట్ కోసం వెయిట్ చేస్తోంది.
సాధారణంగా షారుక్ ఖాన్ సినిమా ఉందంటే పోటీగా తమ సినిమా రిలీజ్ చేసేందుకు ఎవ్వరూ సాహసించరు. అయితే భారీ అంచనాలతో దిల్ వాలే వస్తుందని తెలిసినా బాజీరావు మస్తానీ చిత్రాన్ని వాయిదా వేయడానికి సంజయ్ లీలా భన్సాలీ ఒప్పుకోలేదు. దిల్‌వాలేకి ఎదురెళ్లి బాజీరావు గట్టి పోటీ ఇస్తాడా...బాజీరావ్ పోటీని షారుక్ తట్టుకుంటాడా అన్న చర్చలు ఓ పక్క జరుగుతుండగానే.... దిల్ వాలేను ఢీకొట్టే సీన్ బాజీరావుకు లేదని కొందరంటున్నారు.
సంజయ్‌లీలా బన్సాలీ మాత్రం తన సినిమాపై ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నాడు. ఇక బీ టౌన్ ట్రేడ్ పండితులు అయితే రెండు సినిమాలపై ఎవరి లెక్కల్లో వారు ఉన్నారు. రెండు సినిమాల బయ్యర్లు అయితే తమ సినిమాయే హిట్ అవుతుందని చాలా ధీమాతో ఉన్నారు. ఓవరాల్ గా చూస్తే దిల్ వాలేకు 60 శాతం మల్టీప్లెక్స్ స్ర్కీన్స్ ఇస్తే... బాజీరావుకు 40 శాతం స్ర్కీన్లు ఇచ్చారు. దీంతో దిల్ వాలే కొత్త రికార్డులు క్రియేట్ చేయాలన్నా కనీసం రెండు వారాల పాటు బంపర్ కలెక్షన్లు కొల్లగొట్టాలి. అదే జరగాలంటే సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావాలి. ప్రస్తుతం అంతా వన్ వీక్ టైం నడుస్తుండడంతో సినిమాలో ఎంతో గొప్ప కంటెంట్ ఉంటే తప్ప అది సాధ్యమయ్యేలా లేదు. దీంతో షారుక్ కూడా చాలా టెన్షన్‌తో ఉన్నాడట. దిల్ వాలేకే కేటాయించాల్సిన స్ర్కీన్లలో 40 శాతం స్ర్కీన్లు బాజీరావుకు ఇవ్వడంతో దిల్ వాలే పెట్టుబడి రికవరీ అవ్వాలంటే కనీసం రెండు వారాలైనా అవసరమవుతుంది. అందాకా సినిమా నిలబడకపోతే మాత్రం నష్టాలు ఖాయమంటున్నారు. అయితే బీ టౌన్ పెద్దలు దిల్ వాలే సినిమాకే ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. షారుక్-కాజల్-రోహిత్ శెట్టి కాంబినేషన్ కావడంతో ఈ సినిమాను భారీ రేటుకు కొన్నారు. ఈ భారీ పెట్టుబడి రికవరీ అవ్వాలన్నా దిల్ వాలే సూపర్ హిట్ అవ్వాల్సిందే. అయితే ఫైనల్ గా ఈ రెండు సినిమాలలో ఏ సినిమా ఫైనల్ గా పైచేయి సాధిస్తుందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.