ప్చ్!! బాహుబలి రీమేక్ అవుతోంది
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అందరిని ఎంతగానో ఆకట్టుకున్న బాహుబలి సినిమా ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా దెబ్బకు బాక్స్ ఆఫీస్ రికార్డులన్నీ బద్దలయ్యాయి. అంతే కాకుండా తెలుగు సినిమా చరిత్రలో మొదటిసారి ఒక టాలీవుడ్ సినిమా జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపును అందుకుంది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్ - అనుష్క ఇంకా రానా మెయిన్ లీడ్ లో కనిపించిన సంగతి తెలిసిందే.
ఇక అసలు విషయానికి వస్తే.. బాహుబలి సినిమా గురించి దేశమంతటా అందరికి తెలిసిందే. అయితే ఎవరు ఊహించని విధంగా ఆ సినిమా రీమేక్ హక్కులని కొనుక్కొని తెరకెక్కించడానికి ఓ భోజ్ పూరి హీరో సిద్దమయ్యాడు. భోజ్ పూరి హీరో దినేష్ లాల్ యాదవ్ బాహుబలి సినిమాను రీమేక్ చేయబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపాడు. బాహుబలిని తెలుగు - తమిళ్ లో తెరకెక్కిన సంగతి తెలిసిందే. హిందీలో డబ్ చేశారు. ఇక ఇప్పుడు భోజ్ పురిలో ఈ సినిమా రీమేక్ అవుతోంది.
రెండు భాగాలుగా చిత్రీకరించిన ఈ సినిమాకు మొత్తంగా 400 కోట్లవరకు ఖర్చయ్యింది. మరి వాళ్లు ఎలా చిత్రీకరిస్తారు అనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న. ఇక్బాల్ భక్ష్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా టీజర్ ను 2018 ఏప్రిల్ లో విడుదల చేయాలనీ అనుకుంటున్నారు. ఇక దినేశ్ లాల్ కి జోడీగా ఆమ్రపాలి దుబే నటిస్తోంది. మరి ఈ సినిమా ఎలా తెరకెక్కిస్తారో ఏ స్థాయిలో హిట్ అవుతుందో చూడాలి.