ముంబై టాబ్లాయిడ్లలో నేటి సంచలన వార్త ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ అంధేరిలో అందాల కథానాయిక కృతి సనన్ ఉన్న అంతస్తులోనే రూ. 40 కోట్ల ఖరీదు చేసే డూప్లెక్స్ ను కొనుగోలు చేశారనేది ఆ వార్త సారాంశం. ఆయన ఆవిడ ఉంటున్న కాంప్లెక్స్ లోనే ఎందుకు కొన్నాడో? అన్న తీరుగా ఈ కథనాలు వెలువడడం ఆశ్చర్యకరం. అయితే అదే భవంతిలో చాలా మంది సెలబ్రిటీలకు డూప్లెక్సులు ఉన్నాయన్నది సాటి సెలబ్రిటీలకు.. ముంబై వాసులకు తెలిసిన విషయమే.
ఆనంద్ ఎల్ రాయ్ సకల సౌకర్యాలతో కూడుకున్న డూప్లెక్స్ పై పెట్టుబడులు పెట్టారు. ఇది అతనికి వృత్తిపరమైన కార్యకలాపాలకు ఉపకరించేలా పెద్ద గదులతో కూడిన విశాలమైన గృహం అని తెలిసింది.
తను వెడ్స్ మను -తను వెడ్స్ మను రిటర్న్స్-రాంఝనా-అత్రంగి రే వంటి చిత్రాలను ఆనంద్ ఎల్ రాయ్ తెరకెక్కించారు. తన చిత్రాలతో చిన్న పట్టణాల కథలను అందంగా ప్రదర్శించారు. తాజా కథనాల ప్రకారం ఏస్ డైరెక్టర్ ముంబై అంధేరిలో ఒక కొత్త డ్యూప్లెక్స్ ను కొనుగోలు చేయడం కోసం దాదాపు రూ. 40 కోట్లు వెచ్చించాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నటి కృతి సనన్ ఇదే అంతస్తులో అమితాబ్ కి చెందిన ఇంట్లో అద్దెకు ఉంటోంది.
రాయ్ తెరకెక్కించిన `రక్షా బంధన్` ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన హిట్లర్ తరహా సిస్టర్ సెంటిమెంట్ కథాంశంతో ఉత్తరాది నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఒక వర్గం ప్రేక్షకులు అక్కీపై వ్యతిరేకతతో ఈ సినిమాను బహిష్కరించాలని డిమాండ్ చేశారు.
ముంబై పరిశ్రమలో కొత్త ప్రతిభను ప్రోత్సహించేందుకు అలాగే వారికి మార్గదర్శకత్వం వహించడానికి చేతులు కలిపిన 23 మంది భారతీయ ప్రముఖ దర్శక నిర్మాతలలో ఆనంద్ ఎల్. రాయ్ కూడా ఉన్నారు. గత నెలలో నిర్మాత మహావీర్ జైన్ - జియో స్టూడియోస్.. ముంబైలో FICCI ఫ్రేమ్స్ 2022 ఎడిషన్ లో `కొత్తగా వచ్చినవారు` అనే పేరుతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రయత్నిస్తుండడం ఆసక్తికరం.