పటాస్ సినిమా తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 3 సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. వచ్చే వారంలో రాబోతున్న ఎఫ్ 3 సినిమా ప్రమోషన్ బాధ్యత మొత్తం కూడా తన బుజాలపై వేసుకుని మరీ ప్రమోట్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ కు రీచ్ అయ్యేందుకు దాదాపు అన్ని మార్గాలను కూడా అనిల్ రావిపూడి వదలకుండా ప్రమోషన్ చేస్తున్నాడు.
ఇప్పటి వరకు ఒక్క ప్లాప్ ఎరగని అనిల్ రావిపూడి ఎఫ్ 3 తర్వాత చేయబోతున్న సినిమా ఇప్పటికే కన్ఫర్మ్ అయిన విషయం తెల్సిందే. ఎఫ్ 3 సినిమా షూటింగ్ దశలో ఉండగానే బాలయ్య 108వ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశంను దక్కించుకున్నాడు. బాలయ్య తో సినిమా షూటింగ్ ను అతి త్వరలోనే మొదలు పెట్టబోతున్నట్లుగా స్వయంగా అనీల్ రావిపూడి ఎఫ్ 3 ప్రమోషన్ సందర్బంగా చెప్పుకొచ్చాడు.
పటాస్ విడుదల అయినప్పటి నుండి కూడా ఎన్టీఆర్ తో అనిల్ రావిపూడి ఒక సినిమా చేయాలనుకుంటున్నాడు అనే వార్తలు వచ్చాయి. రాజా ది గ్రేట్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిందనే వార్తలు కూడా వచ్చాయి. పటాస్ వంటి ఒక మాస్ ఎంటర్ టైనర్ ను ఎన్టీఆర్ తో అనిల్ చేస్తే బాగుంటుందని నందమూరి అభిమానులు అంతా కూడా చాలా బలంగా కోరుకుంటున్నారు.
ఎన్టీఆర్ తో సినిమా విషయంలో అనిల్ రావిపూడి స్పష్టత ఇచ్చాడు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ తో సినిమా గురించి చర్చించలేదు అంటూ బాంబు పేల్చినట్లుగా మాట అనేశాడు. ఇప్పుడు కాకున్నా ఆ తర్వాత.. ఆ తర్వాత కాకున్నా మరికొన్నాళ్ల తర్వాత అయినా ఎన్టీఆర్ కు ఒక అదుర్స్ వంటి సినిమాను అనిల్ రావిపూడి ఇస్తాడని ఆశపడితే ఇలా అన్నాడేంటి అంటూ నందమూరి అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఎఫ్ 3 సినిమా తర్వాత బాలయ్య సినిమాను చేయబోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి.. బాలయ్య సినిమా తర్వాత ఏం సినిమా చేస్తాడు అనే విషయంలో స్పష్టతను ఇవ్వలేదు. ఎఫ్ 3 సినిమా సక్సెస్ అయితే మరో సీక్వెల్ ను అనిల్ చేస్తాడేమో చూడాలి. బాలయ్య తో వైవిధ్యభరితమైన మాస్ ఎంటర్ టైనర్ ను అనిల్ రావిపూడి చేస్తాడని ప్రతి ఒక్కరు బలంగా నమ్ముతున్నారు.
అనిల్ రావిపూడి ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుడు అనడంలో సందేహం లేదు. అందుకే మహేష్ బాబు వంటి సూపర్ స్టార్ తో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించిన ఘనత ఆయనకే దక్కింది. అందుకే బాలయ్య కు కూడా ఖచ్చితంగా ఒక మంచి సక్సెస్ ను అనిల్ రావిపూడి ఇస్తాడనే నమ్మకం వ్యక్తం అవుతోంది. అలాంటి అనిల్ ఎప్పుడు ఎన్టీఆర్ ను డైరెక్ట్ చేస్తాడో చూడాలి.