కథ విన్న వెంటనే నాగి చిల్లరగాళ్లు కావాలన్నాడుః అనుదీప్

Update: 2021-03-08 03:35 GMT
షార్ట్‌ ఫిల్మ్‌ లతో ఎంతో మంది దర్శకులుగా మంచి పేరు దక్కించుకున్నారు. కొందరు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్‌ అయ్యారు. ఆ జాబితాలో దర్శకుడు అనుదీప్ కూడా చేరే అవకాశం ఉందని జాతి రత్నాలు ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది. ఎన్నో షార్ట్ ఫిల్మ్ లు తీసిన అనుదీప్ ను దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ దర్శకుడిగా పరిచయం చేసేందుకు ముందుకు వచ్చాడు. జాతి రత్నాలు సినిమా తో అనుదీప్‌ టాలీవుడ్ లో మోస్ట్‌ వాంటెడ్ దర్శకుడిగా మారిపోయే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జాతి రత్నాలు సినిమా ప్రీ రిలీజ్ వేడుక వరంగల్ లో భారీ ఎత్తున జరిగింది.

ఈ సందర్బంగా దర్శకుడు అనుదీప్ మాట్లాడుతూ.. హాయ్‌ వరంగల్‌ మార్చి 11 న మీ ముందుకు వస్తున్నాం అందరు చూసి ఎంజాయ్‌ చేయాలని కోరుకుంటున్నాను. నవీన్‌ పొలిశెట్టి కరెక్ట్‌ టైమ్‌ కు సెట్‌ కు వచ్చేవాడు. ఫరియా బాగా నటించింది. దర్శకుడు నాగ్‌ అశ్విన్ గారికి ఈ కథ చెప్పిన సమయంలో వెంటనే ఆయన ఫుల్‌ చిల్లర గాళ్లు ఈ కథ కోసం కావాలని అన్నారు. అప్పటికే నేను నవీన్ పొలిశెట్టిని అనుకున్నాను. మొదట నవీన్ పేరు చెప్పాను ఆ తర్వాత రాహుల్‌ మరియు ప్రియదర్శిల పేర్లు సూచించాను. డీసెంట్ మ్యూజిక్ డైరెక్టర్ కావాలని అనుకున్నాను. కాని నిర్మాతలు మాత్రం ఫుల్ మాస్ రథన్ ను తీసుకున్నారని అన్నాడు.
Tags:    

Similar News