ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి- మాస్ మహారాజా రవితేజ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక శ్రుతిహాసన్ లాంటి గ్లామర్ డాళ్ మిస్సయ్యింది అనుకుంటుండగానే ఆ స్పేస్ ని కవరప్ చేసేందుకు కేథరిన్ థ్రెసా- ఊర్వశి రౌతేలాను బరిలో దించేసింది టీమ్. వేలాదిగా తరలి వచ్చిన మెగాభిమానులతో వేదిక కిక్కిరిసిపోగా ఈ వేదికపై టీమ్ ఎంతో ఎమోషనల్ గా మాట్లాడారు.
ఇక ఈ వేదికపై దర్శకుడు బాబి మాట్లాడుతూ .. మెగాస్టార్ చిరంజీవి- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సోదరుల గురించి చేసిన ఒక వ్యాఖ్య అభిమానుల్లో కోలాహానికి తెర తీసింది. ఇంతకీ వేదికపై బాబి ఏమన్నారు? అంటే...!
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలను విరమించి పూర్తిగా నటనకే అంకితమైన సంగతి తెలిసిందే. మెగా బాస్ ఖైదీనంబర్ 150తో గ్రేట్ కంబ్యాక్ తర్వాత ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. అదే సమయంలో మెగాస్టార్ స్థానాన్ని భర్తీ చేస్తూ జనసేనానిగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రజల్లో ఉన్నారు. రాబోవు ఎన్నికలకు పవర్ స్టార్ ప్రధాన ఆకర్షణగా మారారు. జనసేన పార్టీ పుంజుకోవడంతో గెలుపు ధీమా పవన్ కల్యాణ్ లో కనిపిస్తోందన్న చర్చ సాగుతోంది.
ఇలాంటి సమయంలో వైకాపా తలపోసిన రాజధాని నగరంగా పిలుస్తున్న విశాఖపట్నంలో చిరు నటించిన `వాల్తేరు వీరయ్య` మెగా ఈవెంట్ ని నిర్వహించడం ఉత్కంఠను పెంచింది. విశాఖ-ఏయు గ్రౌండ్స్ లోకి ఉత్తరాంధ్ర సహా ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈ వేదికపై దర్శకుడు బాబి మాట్లాడుతూ చిరు మంచితనాన్ని ఓర్పు సహనం గురించి హైలైట్ చేస్తూ మాట్లాడారు. బాబి మాట్లాడుతూ-``మెగాస్టార్ లాంటి ఒక అన్న ఒక తండ్రి ఒక పెద్ద ప్రతి కుటుంబానికి కావాల``ని అన్నారు. అంతేకాదు.. మెగాస్టార్ లోని సున్నితత్వాన్ని నొక్కి పలుకుతూ ``మీరు రాజకీయాలకు 1 (వన్) పర్సంట్ కూడా సూట్ కారు.. మీరు సినిమా కథానాయకుడిగానే అందరికీ ఆరాధ్య దైవం. మీకు దేవుడు ఒక తమ్ముడిని ఇచ్చాడు. అతడు రాజకీయాల్ని చూసుకుంటాడు. మీలోంచి వచ్చిన మంచితనం ఆవేశం కలిస్తే పవర్ స్టార్. రాజకీయాల్లో నేడు దూసుకెళుతున్నారు. మీకంటే ముందు పవర్ స్టార్ తో పని చేసాను.. అదే మంచితనం అదే సహనం.. ప్రేమాభిమానాలు పవర్ స్టార్ లో చూశాను!`` అని బాబి వ్యాఖ్యానించారు.
అన్నదమ్ములైన మీ ఇద్దరికీ జనాల మీద ఉన్న ప్రేమ వేరు.. ఎక్కడో తమిళనాడులో పొన్నాంబలం అనే ఫైట్ మాస్టర్ సమస్యల్లో ఉన్నారని తెలిసి స్పందించారు.. సాయం చేశారంటూ ఒక ఉదాహరణను బాబి ఈ వేదికపై గుర్తు చేసారు. పరిశ్రమలో మెగా బ్రదర్స్ ఎందరినో ఆదుకుంటారు అని బాబి ఎంతో ఎమోషనల్ గా మాట్లాడారు. ఇక ఈ వేదికపై అభిమానుల్లో సందడి తగ్గినప్పుడల్లా.. పవర్ స్టార్ అని తలచుకుంటూ అభిమానుల్లో ఉత్సాహం పెంచడం చూస్తుంటే పవర్ స్టార్ కి ఒక జనసేనాని హోదాలో విశాఖ నగరంలో ఉత్తరాదిన పెరిగిన ఫాలోయింగ్ ని కూడా ఇది గుర్తు చేసింది.
ఇక బాబి స్పీచ్ ఆద్యంతం ఎంతో ఎమోషనల్ గా సాగింది. మాస్ వీరయ్య యాక్షన్ డ్యాన్సులతో థియేటర్లలో పూనకాలు ఖాయం. ఇండస్ట్రీకి ఒకడే మెగాస్టార్. ఈ సినిమాకి అభిమానులంతా కలిసి పని చేసాం. మా ప్రేమనే తెరపైకి తెచ్చాం. సినిమాలోకి తెచ్చాం. ఈ కథలో ఒక బలమైన పాత్ర ఉంది.. అని అన్నయ్య చిరుతో చెప్పగా రవితేజకు కథ చెప్పు అన్నారు. ఇలాంటి ఒక సినిమాకి మాస్ మహారాజ్ ఎనర్జీనిచ్చారు. `పవర్` సినిమాతో నాకు తొలి అవకాశం ఇచ్చింది రవితేజ గారు.. ఆయన వల్లనే నేను ఇక్కడ ఉన్నాను. వెండితెరపై ఇద్దరు మాస్ గాడ్స్ ని చూడబోతున్నాం. సంక్రాంతి బరిలో వాల్తేరు వీరయ్య ఘనవిజయం సాధించి తీరుతుంది. థియేటర్లలో పూనకాలు లోడింగ్.. దేవీశ్రీ మ్యూజిక్ తో ఏదైనా సాధ్యమే`` అని మాట్లాడారు. తన సాంకేతిక నిపుణులందరికీ బాబి కృతజ్ఞతలు తెలిపారు.