సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు దర్శకుడిగా 'ఉప్పెన' సినిమా తో పరిచయం అయిన విషయం తెల్సిందే. మొదటి సినిమాతోనే దర్శకుడిగా మంచి పేరు దక్కించుకుంది. ఒక నెగటివ్ క్లైమాక్స్ ను కూడా తెలుగు ప్రేక్షకులకు ఇంత బాగా రీచ్ అయ్యేలా చేయడం అంటే మామూలు విషయం కాదు.. మ్యాటర్ ఉన్న దర్శకుడు ఈయన అంటూ చాలా మంది చాలా రకాలుగా ప్రశంసించారు.
దర్శకుడు సుకుమార్ కు తగ్గ శిష్యుడు అని.. ఆయన వారసుడు అంటూ బుచ్చి బాబును ఆకాశానికి ఎత్తిన వారు ఉన్నారు. ఉప్పెన బ్లాక్ బస్టర్ అవ్వడంతో వెంటనే ఎన్టీఆర్ నుండి కాల్ వచ్చింది. సినిమా చేద్దాం అనే హామీ కూడా వచ్చింది. అయితే కరోనా ఇతరత్ర కారణాల వల్ల అనూహ్యంగా ఎన్టీఆర్ కు సమయం కుదరడం లేదు. బుచ్చి బాబుతో సినిమా చేయాలని ఉన్నా కూడా ఇప్పట్లో చేసే అవకాశాలు కనిపించడం లేదు.
ఆర్ ఆర్ ఆర్ సినిమా ను ఇటీవలే ముగించిన ఎన్టీఆర్ అతి త్వరలోనే కొరటాల శివ సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉంది. కొరటాల శివ ఆచార్య సినిమా తో నిరాశ పర్చడంతో ఎన్టీఆర్ 30 సినిమా విషయంలో స్పీడ్ వద్దు అనుకుంటున్నారు. దాంతో కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్ 31 ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నాడు.
కొరటాల శివ ఎన్టీఆర్ 30 మరియు ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ 31 పూర్తి అయిన తర్వాత ఎన్టీఆర్ 32 కి బుచ్చి బాబుకు అవకాశం దక్కనుంది. కనీసం రెండు సంవత్సరాలు అయ్యే అవకాశం ఉంది. అందుకే ఎన్టీఆర్ తో సినిమా కంటే ముందు ఉప్పెన వంటి ఒక చిన్న సినిమాను.. చిన్న హీరోతో కాన్సెప్ట్ బేస్డ్ సినిమా ను రూపొందించే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఎన్టీఆర్ కూడా అందుకు బుచ్చి బాబుకు అనుమతించాడనే వార్తలు వస్తున్నాయి. ఈ రెండేళ్ల సమయం ను బుచ్చి బాబు వృధా చేసుకుంటే ఆయన చాలా దురదృష్టవంతుడు అవుతాడు. అందుకే ఒకటి కాదు రెండు చిన్న సినిమాలు చేసినా నష్టం లేదు అనేది కొందరి వాదన. బుచ్చి బాబు చేయబోతున్న ఆ సినిమా ను అతి త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.
చిన్న హీరో లేదా కొత్త హీరో కోసం ఇప్పటికే బుచ్చి బాబు అన్వేషణ మొదలు పెట్టాడని తెలుస్తుంది. ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ పడ్డ తర్వాత రెండేళ్లు అయినా కూడా సినిమా ను మొదలు పెట్టక పోవడం ఖచ్చితంగా చాలా దురదృష్టం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాత్రమే కాకుండా ప్రేక్షకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.