ఎక్స్ క్లూజివ్ - థియేట‌ర్స్ కి వెళ్లి సెల్ఫీలు పెడ‌తారు

Update: 2020-05-07 04:30 GMT
* హాయ్ చందు గారు ఎలా ఉన్నారు

నేను బావున్నా అండి, సాధ‌ర‌ణంగా ఫ్యామిలీకి ఎక్కువ టైమ్ ఇచ్చే నాకు ఇంకాస్త క్వాలిటీగా స్పెండ్ చేసే టైమ్ వ‌చ్చింది. ఫుల్ హ్యాపీగా, పాజీటివ్ గా ఉన్నాను.

* ఇప్ప‌టి వ‌ర‌కు మ‌నంద‌రం చ‌రిత్ర విన్నామ్, చ‌దివామ్ ఇప్పుడు చూస్తున్నామ్ కాదంటారా

చ‌రిత్ర‌ని చూస్తున్నామ్ అనేకంటే చ‌రిత్ర‌లో మ‌నం కూడా ఒక భాగం అయిపోయామ్ అని నాకు అనిపిస్తోంది. ఎప్పుడో వందేళ్ల క్రింద‌ట ఇలాంటి విపత్తు వ‌చ్చి ప్ర‌పంచమంతా అతలాకుత‌లం అయిపోయింద‌ని హిస్ట‌రీ చెబుతోంది. ఇప్పుడు మ‌నం అనుభ‌విస్తున్న ఈ క్రైసిస్ గురించి మ‌రో వందేళ్లు మాట్లాడుకుంటారు. మీరు ఓసారి గ‌మ‌నిస్తే ప్ర‌పంచం మొత్తం ఇప్పుడు అత్య‌ధికంగా తెలిసిన పేరు క‌రోనా.

* ప్యాష‌న్ డ్రివెన్ డైరెక్ట‌ర్ గా మీరు ఇండ‌స్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు, ఈ ఆస‌క్తి ఎప్ప‌టి నుంచి మొద‌లైంది

నేను చేసే సినిమాలు అన్నిటిలో ఏదొక థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉండ‌టం వ‌ల‌నే న‌న్ను ప్యాష‌న్ డైరెక్ట‌ర్స్ జాబితాలో చేర్చేశారు. అయితే క‌మ‌ర్శీయ‌ల్ గా సక్సెస్ అయితేనే ఈ ఇండ‌స్ట్రీలో ఉండ‌గ‌లం. నాలుగు సినిమాలు తీయ‌గ‌లం అందుకే నా క‌థ‌లకి కాస్త క‌మ‌ర్శీయాలిటీ జోడించేది, ఇక ఈ ఆస‌క్తి నేను చేస్తున్న ప‌ని, ఆ ప‌ని కోసం నేను ఎంచుకునే ప‌ద్ధ‌త్తుల్ని బ‌ట్టి ఆటోమెటిక్ గా అల‌వాటు అయిపోయింది. కార్తీకేయ చేస్తున్న‌ప్ప‌డు అంతా ఎందుకు ఇంత రిస్క్ స‌బ్జెక్ట్ చేస్తున్నావు, స‌రిగ్గా స్క్రీన్ ప్రెజెన్స్ లేక‌పోతే సినిమా ఆడియెన్స్ క‌నెక్ట్ అవ్వ‌దు అని చాలా మంది సూచ‌న‌లు చేశారు. కానీ సంథింగ్ డిఫ‌రెంట్ గా వెళ్లాలి, అప్పుడే మ‌న‌కంటూ ఓ ప్ర‌త్యేకమైన గుర్తింపు ఉంటుందని నా గ‌ట్ ఫీలింగ్ తో కార్తికేయ‌తోనే డైరెక్ట‌ర్ గా నా తొలి అడుగు వేశాను.

* మిగ‌తా డిపార్ట్మెంట్స్ కంటే డైరెక్ష‌న్ లో కాస్త ఇన్ సెక్యూరిటీ ఎక్క‌వ అనే వాద‌న ఉంది నిజ‌మేనంటారా

సింపుల్ అండి ఇవాళ రేపు హిట్ వ‌స్తేనే నెక్ట్స్ ప్రాజెక్ట్ చేసే అవ‌కాశం ఉంది. 100 హిట్లు ఇచ్చిన పేరు ఒక్క ఫ్లాపు చెడ‌గొట్టేస్తుంది. నిజానికి డైరక్ట‌ర్ అవ్వాలంటే ఓ మూడు నాలుగేళ్ల క్రితం వ‌రకు ఎక్స్ పీరియ‌న్స్ ఉన్న ఆస్టిస్టెంట్ డైరెక్టర్లు, కో డైరెక్ట‌ర్ ల‌కే అవ‌కాశం ల‌భించేది. ఇప్పుడు అలా కాదు మంచి కాన్సెప్ట్ ఉన్నా చాలు డైరెక్ట‌ర్ అయిపోవ‌చ్చు. నిర్మాత‌లు, హీరోలు కూడా ఇప్పుడు కంటెంట్ కి ఇచ్చే ప్రిఫరెన్స్ ఎక్స్ పీరియ‌న్స్ ఇవ్వ‌డం లేదు. అందుకే ఈ డిపార్ట్మెంట్ లో పోటీ ఎక్కువు ఉంది. దీంతో ఒక్క ఫ్లాపు వ‌చ్చినా మ‌రో అవ‌కాశం రావ‌డానికి చాలా స‌మ‌యం పట్టేస్తుంది.

* మీరు హిట్స్ లోనే ఉన్నారు, కానీ మీ కెరీర్ లో ఎందుకింత గ్యాప్

ఇందాకే చెప్పాను క‌దా అండి, నేను ఫ్యామిలీకి ఎక్క‌వ టైమ్ కేటాయిస్తాను. అలా అని ప‌ని చేయ‌ను అని కాదు, ఒక్కసారి రైటింగ్ స్టార్ట్ చేస్తే ఫ్లో అలా వెలిపోతూ ఉంటుంది. అయితే ఆ స్టార్టింగ్ కే నేను చాలా టైమ్ తీసుకుంటాను. అయితే ఈ ప‌ద్ధ‌తి ఇక నుంచి మార్చేయాలి అనుకుంటున్నా. కొద్దిగా స్పీడ్ పెంచాల్సిన టైమ్ వ‌చ్చింది. అయితే ఇక్క‌డ నేనో పాయింట్ చెబుతాను, డైరెక్ట‌ర్ చంద్ర‌శేఖ‌ర్ యేలెటి గారు ఇండ‌స్ట్రీకి వ‌చ్చి దాదాపు 20 ఏళ్లు అయింది. కానీ ఆయ‌న తీసిన సినిమాలు చాలా త‌క్కువ, కానీ ఇప్ప‌టికి ఆయ‌నకు ఇండ‌స్ట్రీ నుంచి మ‌ద్ద‌త్తు ల‌భిస్తూనే ఉంది.

 * క‌రోనా కార‌ణంగా ఇండ‌స్ట్రీ చాలా ఇబ్బందుల్లో ఉంది. మ‌రి కార్తికేయ 2 విష‌యంలో మీ నిర్మాత‌లకు మీరు ఎలాంటి స‌హ‌కారం అందిస్తున్నారు

నేనే కాదు సినిమా బ్ర‌త‌కాలని అనుకునే ప్ర‌తి ఒక్క‌రు ముందుగా చేయాల్సింది. నిర్మాత‌ల్ని బ్ర‌తికంచ‌డ‌మే, ఈ క‌రోనా కార‌ణంగా వారికి బ‌డ్జెట్ విష‌యంలో చాలా ఇబ్బందులు రావ‌చ్చు. అందుకే ఏది అవ‌స‌రం అనుకుంటే అది ఉంచి, లేని వాటి గురించి ఆలోచించ‌కుండా ప‌ని చేసుకుంటూ పోవాలి. నేను కూడా కార్తికేయ 2 నిర్మాత‌ల‌కు అన్ని విష‌యాల్లో పూర్తిగా స‌హ‌క‌రించాల‌ని నిర్ణ‌యించుకున్నాను. మా టీమ్ అంద‌రూ మా నిర్మాత‌ల నిర్ణ‌యానికి మ‌నఃస్పూర్తిగా స‌పోర్ట్ చేస్తాము. మ‌రో విష‌యం క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల‌కు ప్ర‌భుత్వానికి అండ‌గా నిలిచిన సెక్టార్స్ లో సినిమా ఇండ‌స్ట్రీ వారే అంద‌రికంటే ముందుగా విరాళ‌లు ప్ర‌క‌టించారు. కానీ ఈ వ్యాధి కార‌ణంగా ఎక్కువుగా ఎఫెక్ట్ అయ్యేది కూడా సినిమా ఇండ‌స్ట్రీ కావ‌డం దుర‌దృష్ట‌క‌రం. ఎందుకంటే క‌రోనా కంట్రోల్ చేయాలంటే ఎక్క‌డా ఎవ్వ‌రు ఓ స‌మూహం గా ఏర్ప‌డ‌కూడదు. ఇలా థియేట‌ర్స్ లో కానీ సినిమా షూటింగ్స్ లో కానీ జ‌రిగే అవ‌కాశం ఎక్కువ ఉండ‌టంతో ఇండ‌స్ట్రీ మీద ప్ర‌భుత్వ నిషేదాజ్ఞ‌లు స‌వ‌రించ‌డానికి కొంత స‌మ‌యం ప‌డుతుంది

* ప్ర‌భుత్వం లాక్ డౌన్ తొలగించిన త‌రువాత కూడా ఈ ప్ర‌భావం కొన‌సాగే అవకాశం ఉందంటున్నారు, దీని పై మీ స్పంద‌న ఏంటి

థియేట‌ర్స్ తెరిచిన మ‌రుక్ష‌ణం, వీ కేమ్ ఫ‌ర్ ద మార్నింగ్ షో, ఇన్ ఐ మాక్స్ ఆఫ్ట‌ర్ లాంగ్ టైమ్ అని సోష‌ల్ మీడియా ద‌ద్ద‌రిల్లిపోతుంది. ఒక్క విష‌యం సూటిగా చెబుతున్నా. ఈ లాక్ డౌన్ టైమ్ లో జ‌నాల్ని డిప్రెష‌న్ నుంచి కాపాడుతున్న ఏకైక సోర్స్ సినిమాలు, ఎంట‌ర్ టైన్మెంట్ మాత్ర‌మే అని అభిప్రాయం. ఎలాంటి విపత్తలు వ‌చ్చిన సినిమాను థియేట‌ర్ చూసి ఎంజాయ్ చేసే ప్రేక్ష‌కుల మైండ్ సెట్ ని మార్చ‌లేవు

* కార్తీకేయ 2 పై భారీగా అంచ‌నాలు ఉన్నాయి, అనుకోకుండా ఇప్పుడు కొంత గ్యాప్ కూడా దొరికింది, క‌థ విష‌యంలో ఏమైనా హోమ్ వ‌ర్క్ చేస్తున్నారా

కార్తీకేయ 2 ని నేను వెంట‌నే మొద‌లు పెట్ట‌క‌పోవానికి, ఇంత గ్యాప్ తీసుకొని స్టార్ట్ చేయ‌డానికి కార్తీకేయ బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ అవ్వ‌డ‌మే. కార్తీకేయ సినిమా పై అప్ప‌ట్లో ఆడియెన్స్ కి ఎలాంటి అంచ‌నాలు లేవు. కానీ ఇప్పుడు మేము చేస్తున్న ఈ సీక్వెల్ ప్రాజెక్ట్ కి ఆల్రేడీ కార్తీకేయ పై ఉన్న ఆడియెన్స్ అంచ‌నాలు భారం చాలా ఎక్కువ‌గా ఉంటుంది. అందుకే క‌థ విష‌యంలో ఎక్క‌డ కూడా ఎలాంటి లూప్ హోల్స్ లేకుండా జాగ్ర‌త్త పడుతున్నా. కార్తీకేయ 2 కూడా ఆడియెన్స్ ని బాగా ఎంట‌ర్ టైన్ చేసే రెడీ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తాను

* నిఖిల్ మీకు గాఢ్ ఫాథ‌ర్ అని అనొచ్చా

నిజానికి నిఖిల్ లేక‌పోతే ఇప్పుడు మీరు ఈ ఇంట‌ర్ వ్యూ కూడా చేసే వారు కాదు కదా. అప్పుడు అలా నిఖిల్ అవ‌కాశం ఇవ్వ‌డం వ‌ల్లే కాదా, నేను ఇక్క‌డ వ‌ర‌కు వ‌చ్చింది.

* మీ ఇద్ద‌రి స్నేహం కార్తీకేయ 2 తో మ‌రితం బ‌ల‌ప‌డాల‌ని, ఈ ప్రాజెక్ట్  కార్తీకేయ ని మించిన సక్సెస్ అందుకోవాల‌ని మ‌నః స్పూర్తిగా మా తుపాకీ టీమ్ కోరుకుంటుంది. ఆల్ ది బెస్ట్

తుపాకీ డాట్ కామ్ లో ఆర్టీక‌ల్స్ నేను ఫాలో అవుతూ ఉంటాను, ఉన్న‌ది ఉన్న‌ట్లుగా రాస్తారు. ఈ సైట్ రీడ‌ర్స్ అంద‌రికి నా విన్న‌పం ఒక్క‌టే, ఈ క‌రోనా టైమ్ లో బ‌య‌ట‌కి రాకండి, ఇంట్లోనే సేఫ్ గా ఉండండి - ఆల్ ది బెస్ట్

* థ్యాంక్యూ
Tags:    

Similar News