'చిత్రం' 'నువ్వు నేను' 'మనసంతా నువ్వే' వంటి సినిమాలతో మంచి విజయాలు అందుకున్న హీరో ఉదయ్ కిరణ్.. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇండస్ట్రీలో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న యువ హీరో అర్థాంతరంగా తనువు చాలించిన సంగతి తెలిసిందే.
2014 లో ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకొని బలవన్మరణం పొందడం తెలుగు చిత్ర పరిశ్రమని షాక్ కి గురి చేసింది. ఉదయ్ ఆత్మహత్య చేసుకోడానికి బంధుప్రీతి మరియు ఇండస్ట్రీలోని కొందరు వ్యక్తులు కారణమని అప్పట్లో చర్చలు జరిగాయి. అయితే అతను ఎందుకు చనిపోయాడనే దానిపై ఇప్పటికీ సరైన క్లారిటీ లేదు.
ఈ నేపథ్యంలో ఉదయ్ కిరణ్ ని హీరోగా లాంచ్ చేసిన క్రియేటివ్ డైరెక్టర్ తేజ.. ఇటీవల ఓ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతని మరణంపై కీలక వ్యాఖ్యలు చేసారు. ఉదయ్ కిరణ్ మరణానికి గల కారణాలు తనకు తెలుసని.. కానీ అవి ఇప్పుడు బయట పెట్టలేనని చెప్పుకొచ్చారు.
'ఔనన్నా కాదన్నా' సినిమా షూటింగ్ సమయంలో నాతో చాలా మాట్లాడాడు. చాలా విషయాలు షేర్ చేసుకొని బాధపడ్డాడు. ఉదయ్ కిరణ్ జీవితంలో ఏం జరిగిందో అంతా నాకు తెలుసు. నాకు అన్ని విషయాలు చెప్పేవాడు. అతని ఆత్మహత్యకు కారణాలు ఏంటో సమయం వచ్చినప్పుడు బయటపెడతాను. నేను చనిపోయేలోపు ఆ విషయాలను చెప్తాను అని తేజ అన్నారు.
ఉదయ్ కిరణ్ మృతికి కారణాలు తెలుసంటూ తేజ చేసిన కామెంట్స్ టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న దర్శకుడు ఎప్పటికైనా నిజాలు బయటపెడతానని అనడంతో.. ఉదయ్ కిరణ్ మరణం గురించి తేజ ఏమైనా సినిమా ప్లాన్ చేస్తారా? అనే చర్చ మొదలైంది. దీనిపై తాజాగా డైరెక్టర్ గీతాకృష్ణ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
ఉదయ్ కిరణ్ మరణానికి గల కారణాలపై తనకు పూర్తిగా అవగాహన లేదని.. అతన్ని హీరోగా పరిచయం చేయడమే కాదు ఎక్కువ కాలం ట్రావెల్ చేసిన డైరెక్టర్ తేజకు అన్ని విషయాలు తెలిసి ఉండవచ్చని గీతాకృష్ణ అన్నారు. అతని జీవితానికి సంబంధించిన అన్ని విషయాల మీద తేజకు అవగాహన కచ్చితంగా ఉంటుందని.. ఘోరమైన నిజాలను తెరకెక్కిస్తే బాగానే ఉండొచ్చని.. ఉదయ్ కిరణ్ సూసైడ్ వెనకున్న నిజాల మీద సినిమా అంటే అతనికి ప్లస్ అవుతుందని గీతాకృష్ణ పేర్కొన్నారు.
గీతా కృష్ణ మాట్లాడుతూ.. ''ఉదయ్ కిరణ్ అప్పట్లో చిరంజీవి కూతురితోటి తిరిగే వాడు. పెళ్లి చేయాలని నిశ్చితార్థం పెట్టారు. పవన్ కళ్యాణ్ ఓసారి రోడ్ మీద ఏదో స్ట్రైక్ చేస్తున్నప్పుడు డెక్కన్ క్రానికల్ వారితో గొడవ జరిగింది. అది మనసులో పెట్టుకొని పవన్ ని బ్యాడ్ చేయడం కోసం.. ఉదయ్ కిరణ్ కు ఆల్రెడీ పెళ్ళైన విషయం ఫొటోలతో సహా బయటపెడతామని బెదిరించారు. చిరంజీవి ఫ్యామిలీకి అప్పుడే ఈ నిజం తెలిసింది. డెక్కన్ క్రానికల్ వాళ్ళు బయటపెట్టిన నిజాన్ని ఒక బ్లాక్ మెయిల్ గా వాడుకొని చిరంజీవి ఫ్యామిలీతో ఆడుకున్నారు. ఆ టైములో పవన్ కళ్యాణ్ వెళ్లి ఉదయ్ కిరణ్ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేయబోయినట్లు విన్నాను'' అని చెప్పుకొచ్చారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View