హను రాఘవపూడి దర్శకత్వం వహించిన 'సీతా రామం' సినిమా ఈ నెల 5వ తేదీన థియేటర్స్ కి రానుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించారు.
ప్రభాస్ చీఫ్ గెస్టుగా వచ్చిన ఈ వేదికపై హను రాఘవపూడి మాట్లాడుతూ .. "ఈ సినిమా విషయంలో రెండు సంవత్సరాల జ్ఞాపకాలు .. ఎక్కడ మొదలుపెట్టాలో తెలియడం లేదు. ఇదివరకు స్టేజ్ పై మాట్లాడాలంటే నాకు కాస్త భయంగా ఉండేది .. ఇప్పుడు ఆ టెన్షన్ లేదు. అందుకు కారణం ఈ సినిమానే. నన్ను నేను సంస్కరించుకోవడానికి ఈ సినిమా చాలా ఉపయోగపడింది.
నాకు కొంచెం చాదస్తం అని అందరూ అంటూ ఉంటారు .. అందులో ఎంతో కొంత నిజం ఉంది. నా కంటే ఎక్కువ చాదస్తం స్వప్నకు ఉంది. వైజయంతీ మూవీస్ .. స్వప్న సినిమాస్ కలిసి చేస్తున్నాయంటే, ఒక బెంచ్ మార్క్ ఉండాలనే తపన తనది. కోవిడ్ సమయం అనేది ఈ కథను గురించి మరింతగా ఆలోచన చేయడానికి ఉపయోగపడింది. ఈ సినిమా ఈ టీమ్ అంతా ఇంత కాన్ఫిడెంట్ గా ఉండటానికి కారణం, అప్పుడు మాకు దొరికిన ఆ సమయమే. సుమంత్ గారికి కథ చెప్పడానికి వెళితే .. కథను చదివి మరీ ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఇప్పటివరకూ నాపై ఒక నింద ఉంది .. నాకు సెకండాఫ్ సిండ్రోమ్ ఉందని. సెకండాఫ్ కథను కావాలని చెడగొడుతూ ఉంటానని చెబుతుంటారు. ఈ సారి అలాంటిది జరగకుండా చూసుకున్నాను .. జరగలేదు కూడా. కథ చేతిలో ఉంది .. మంచి ఆర్టిస్టులు దొరికారు .. ఇక తీయడానికి ఒక అద్భుతమైన సినిమాటోగ్రఫర్ కావాలి. ఆ సమయంలోనే వినోద్ గారు ఎంట్రీ ఇచ్చారు. షూటింగుకి సంబంధించిన అనేక ట్రబుల్స్ నుంచి నన్ను ఆయన బయటపడేశారు. వెదర్ సపోర్ట్ చేయదు .. సిట్యువేషన్ సపోర్టు చేయదు .. ఆ సమయంలో ఆయన పెద్ద ట్రబుల్ షూటర్ నాకు.
నేను కేవలం డైరెక్షన్ చేసుకుంటే చాలు అనేంత కంఫర్ట్ ను వినోద్ గారు ఇచ్చారు. నిజం చెప్పాలంటే నేను డైరెక్షన్ ఒక్కటి మాత్రమే చేశాను. చంద్రశేఖర్ యేలేటి గారి తరువాత వినోద్ గారు నాకు ఒక టీచర్ అయ్యారు. ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఈ సినిమాను ఇప్పటివరకూ నేను చాలాసార్లు చూశాను.
అయినా ఎక్కడా బోర్ అనిపించలేదు. సినిమా బాగా వచ్చిందనడానికి ఇది ఒక నిదర్శనంగా నేను భావిస్తున్నాను. సినిమా మొదలు కాగానే మీరంతా కూడా 1960కాలంలోకి వెళ్లిపోతారు. ఈ సినిమా చూస్తున్నంత సేపు మీరు మీ మొబైల్ ను ముట్టుకోరు" అంటూ చెప్పుకొచ్చాడు.