వాళ్లకి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పిన ధమాకా..!

Update: 2022-12-30 04:36 GMT
ధమాకా సక్సెస్ మీట్ లో డైరెక్టర్ హరీశ్ శంకర్ ఎమోషనల్ అయ్యారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న తనకు షాక్ సినిమాతో డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చిన రవితేజ ఆ సినిమా ఫ్లాప్ అయినా రెండో ఛాన్స్ కూడా ఇచ్చి తనని ఎంకరేజ్ చేశారని అన్నారు. తన సినిమా ఫ్లాప్ అయిందని ఒక ప్రాజెక్ట్ మధ్యలో ఆగిపోగా ఆ నిర్మాతకు చెప్పు తన రెండో సినిమా కూడా రవితేజ చేస్తున్నాడని అన్నయ్య రవితేజ చెప్పిన మాటలు ఇప్పటికీ తనకు గుర్తున్నాయని.. తను అసిస్టెంట్ గా ఉన్నప్పుడు.. అసోసియేట్ గా ఉన్నప్పుడూ ఇలా ప్రతి సందర్భంలో తనలో దర్శకుడినే రవితేజ అన్నయ్య చూశాడని అన్నారు హరీశ్ శంకర్.

ఇండస్ట్రీలో తనలాంటి వారికి ఛాన్స్ ఇచ్చిన వ్యక్తి రవితేజ అని.. మొదటి సినిమా ఫెయిల్ అయితే సెకండ్ ఛాన్స్ ఇచ్చిన వ్యక్తి కూడా రవితేజనే అని అన్నారు హరీశ్ శంకర్. ధమాకా సినిమా విషయానికి వస్తే ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో నానా రకాలుగా మాట్లాడారని వాళ్లందరికి చెప్పుతో కొట్టినట్టుగా ఈ సినిమా వసూళ్లు ఉన్నాయని. సినిమాని రిజల్ట్ ని ఎవరు ఎప్పుడు డిసైడ్ చేయలేరని చెప్పారు హరీశ్ శంకర్.

తనకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన వ్యక్తిగా రవితేజని అన్నయ్యగా పిలుస్తూ రవితేజ కాళ్లకి నమస్కారం చేయబోయాడు హరీశ్ శంకర్. ఇప్పుడతను స్టార్ డైరెక్టర్.. కానీ అతనిలోని దర్శకుడిని గుర్తించింది మొదట రవితేజ అని అన్నారు. మొత్తానికి ధమాకా సక్సెస్ ఈవెంట్ లో రవితేజ మీద తనకున్న అభిమానాన్ని చూపించి అందరిని సర్ ప్రైజ్ చేశారు డైరెక్టర్ హరీశ్ శంకర్.

ధమాకా విషయానికి వస్తే.. త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వసూళ్లు బ్రహ్నాండంగా ఉన్నాయి. ఈ సినిమా వసూళ్లతో మరోసారి రవితేజ తన స్టామినా ఏంటో ప్రూవ్ చేశారు. పోటీగా పెద్ద సినిమాలేవి లేకపోవడంతో ధమాకా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. హరీశ్ శంకర్ అన్నట్టుగా ధమాకా జాతర ఇలానే సంక్రాంతి వరకు కొనసాగేలా ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News