హీరో గొప్పా.. డైరెక్టరు గొప్పా అనే ప్రశ్న మన ఇండస్ట్రీలో ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. ఐతే ఈ మధ్య హీరోల మీద డైరెక్టర్ల డామినేషన్ కొంచెం పెరిగిందన్న అభిప్రాయం జనాల్లో ఉంది. ఇదే ప్రశ్న స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ముందుంచితే నవ్వేశాడు. మనది హీరో స్వామ్య ఇండస్ట్రీనే అంటున్నాడు. ఫ్లాపిచ్చినా హీరోలకు ఢోకా ఉండదని.. డైరెక్టర్ అనేక లిమిటేషన్స్ మధ్య పని చేస్తాడని అతనంటున్నాడు. ఇందుకు ఉదాహరణలు కూడా ఇస్తున్నాడు.
‘‘రామయ్యా వస్తావయ్యా ఫ్లాపయ్యాక హరీష్ కు సినిమాలు ఎవరిస్తారని అన్నారే కానీ.. ఎన్టీఆర్ కు ఎవరిస్తారని ఎవరైనా అన్నారా? ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఎన్ని సినిమాలు చేశాడు.. నేనెన్ని చేశానో చూడండి. ఫ్లాప్ అయినప్పుడు తప్పు డైరెక్టరుదే అవుతుంది. దాని ఫలితం కూడా డైరెక్టరే అనుభవిస్తాడు. హీరోలు కాదు. హీరో వంద మందిని తెగనరికితే కానీ.. ఇండస్ట్రీ రికార్డు బద్దలవని ఇండస్ట్రీ మనది. ఏదైనా ప్రేక్షకుడి అభిరుచి మేరకే తీయాలి. డైరెక్టర్లు చాలా రాజీ పడాల్సి ఉంటుంది. శంకర్ లాంటి పెద్ద డైరెక్టర్నే ‘మీరెప్పుడైనా రాజీ పడ్డారా’ అని అడిగితే.. ఇంకో 30 కోట్ల బడ్జెట్ ఎక్కువిచ్చి ఉంటే రోబో సినిమాను మరో లెవెల్ కి తీసుకెళ్లేవాడిని అన్నారు’’ అని హరీష్ పేర్కొన్నాడు.
ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరో తనకిచ్చిన ఛాన్స్ ను సరిగా వాడుకోలేదన్న బాధ తనకుందని.. మళ్లీ ఎన్టీఆర్ ఎప్పుడు ఛాన్స్ ఇస్తే అప్పుడు సినిమా చేస్తానని.. ఈసారి లెక్క సరి చేస్తానని హరీష్ చెప్పాడు.