తెలుగు తెరకు నటుడిగా పరిచయం అయి.. ఆ తర్వాత రచయితగా మారి.. చివరగా దర్శకుడి అవతారం ఎత్తాడు హర్షవర్ధన్. అతడిలో ఒక రచయిత.. దర్శకుడు ఉన్నాడని చాలా కాలం వరకు తెలియలేదు. బుల్లితెరపై.. వెండి తెరపై చాలా కాలం నటుడిగానే ఉండిపోయాడతను. ఆపై ‘అమృతం’ సీరియల్లో కొన్ని ఎపిసోడ్లు డైరెక్ట్ చేయడం.. రచనలోనూ పాలుపంచుకోవడం ద్వారా తనలోని మరో కోణాన్ని బయటపెట్టాడు. తర్వాత ‘ఇష్క్’.. ‘గుండె జారి గల్లంతయ్యిందే’.. ‘మనం’ లాంటి సినిమాలతో రైటర్ గా తన బలాన్ని చూపించాడు. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే సినిమాతో అతను దర్శకుడిగా అరంగేట్రం చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈ చిత్రం ఏడాది కిందటే షూటింగ్ పూర్తి చేసుకుంది. అప్పట్లో ఒక వెరైటీ ట్రైలర్ కూడా వదిలాడు. ఇక సినిమా రిలీజే తరువాయి అనుకుంటుంటే.. అది వార్తల్లో లేకుండా పోయింది.
చాలా కాలంగా హర్ష ఆ సినిమా గురించి ఏమీ మాట్లాడట్లేదు. సమస్య ఎక్కడొచ్చిందో ఏమో కానీ.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ రిలీజయ్యే అవకాశాలు కనిపించడం లేదు. దాని సంగతి వదిలేసి దర్శకుడిగా తన తర్వాతి సినిమాకు చేసుకుంటున్నాడు హర్ష. మహేష్ బాబు బావ సుధీర్ బాబు హీరోగా తన రెండో సినిమా మొదలుపెట్టే ప్రయత్నాల్లో ఉన్నాడట అతను. ఇటీవలే సుధీర్ కు ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ చెప్పి మెప్పించాడట హర్షవర్ధన్. అతను ఓకే చెప్పి అవసరమైతే సొంత బేనర్లోనే ఈ సినిమా చేస్తానని హామీ ఇచ్చాడట. కానీ ఈ సినిమా మొదలుపెట్టడానికి సమయం అడిగాడట. చివరగా ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో పలకరించిన సుధీర్.. ప్రస్తుతం పుల్లెల గోపీచంద్ బయోపిక్ కోసం సన్నద్ధమవుతున్నాడు. ఈ సినిమా నుంచి బయటికి రావడానికి దాదాపు ఏడాది సమయం పడుతుంది. ఈ లోపు హర్ష స్క్రిప్టును పక్కాగా రెడీ చేసుకోవాలనుకుంటున్నాడు.