చైతూ ఇంతవరకూ రాముడు .. ఇప్పుడు కృష్ణుడు!

Update: 2022-01-13 17:18 GMT
అక్కినేని అభిమానులంతా ఇప్పుడు 'బంగార్రాజు' సినిమా కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. అన్నపూర్ణ బ్యానర్లో కల్యాణ్ కృష్ణ రూపొందించిన ఈ సినిమా, సంక్రాంతి కానుకగా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన కథ కావడంతో అంతా ఆసక్తితో ఉన్నారు. నాగ్ సరసన నాయికగా రమ్యకృష్ణ నటించగా, చైతూ జోడీగా కృతి శెట్టి అలరించనుంది. అనూప్ రూబెన్స్ అందించిన పాటలకి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ .. హైటెక్ సిటీ .. హోటల్ ట్రైడెంట్ లో జరిగింది.

ఈ వేదికపై కల్యాణ్ కృష్ణ మాట్లాడుతూ .. " ఈ సినిమాను నమ్మకమే నడిపించింది .. ఆ నమ్మకమే నాగ్ సార్. ఒక నిమిషంలో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ దాని వెనుక ఆయన వందసార్లు ఆలోచిస్తారు. ఏ విషయానికి సంబంధించైనా ఆయన అవునన్నా .. కాదన్నా ఒక క్లారిటీ ఉంటుంది. మా అందరినీ ఒక దండ గుచ్చినట్టుగా ఒక లైన్లో ముందుకు నడిపించారు .. ఆయన మా కెప్టెన్. ఆయన డైరెక్షన్లో మేమంతా ముందుకు వెళ్లాము. లేదంటే ఇంత పెద్ద సినిమాను .. ఇంత తక్కువ సమయంలో చేయలేకపోయేవాళ్లం.

మొదటి నుంచి కూడా మా టార్గెట్ సంక్రాంతే. అందువలన సంక్రాంతికి రావడానికి ఏం చేయాలనేదే ఆలోచించాము. నాగ్ సార్ దిశానిర్దేశంలో అనుకున్న సమయానికి ఈ సినిమాను పూర్తిచేయగలిగాము. 'బంగార్రాజు' పాత్ర పుట్టిందే నాగ్ సార్ గురించి. ఆ తరువాతనే కథ పుట్టింది. 'సోగ్గాడే చిన్ని నాయనా'లో ఫన్ .. లవ్ .. సెంటిమెంట్ .. రొమాన్స్ ను అంతా లవ్ చేశారు. ఆ సినిమా థియేటర్లో నుంచి బయటికి వచ్చిన తరువాత, ఒక పాప "బంగార్రాజును అప్పుడే పంపించారెందుకూ? ఇక్కడే ఉంచవచ్చుగదా" అంది. అంతగా ఆ పాత్ర పిల్లలకు కూడా కనెక్ట్ అయింది. సీక్వెల్ చేయాలనే ఆలోచన అప్పుడే వచ్చింది.

నాగ్ సార్ లో చిన్న సరసం ఉంటుంది .. రొమాన్స్ ఉంటుంది .. ఆయన నవ్వును ఎడిటింగ్ రూమ్ లో చూసి కూడా నేను మురిసిపోతుంటాను. ఈ రోజున నేను ఇక్కడ ఉండటానికి కారణం ఆయనే. హండ్రెడ్ పర్సెంట్ నన్ను నమ్మిన మొదటి వ్యక్తి నాగ్ సార్. అందుకు నేను ఆయనకి థ్యాంక్స్ చెబుతున్నాను. చైతూ విషయానికి వస్తే నిజంగానే ఆయన బంగారం. ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకోవచ్చునని అనిపించింది. ప్రతి విషయంలోను ఆయన చాలా క్లారిటీతో ఉంటాడు. చైతూ చూడటానికి చాలా సైలెంట్ అనిపిస్తాడు గానీ .. అంత సైలెంట్ కాదు. ఇప్పటివరకూ ఆయన చేసినవి రాముడి క్యారెక్టర్లు అయితే, ఇప్పుడు చేసింది కృష్ణుడి క్యారెక్టర్. ఇక రమ్యకృష్ణ గారు .. కృతి శెట్టి అద్భుతంగా చేశారు. ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకం ఉంది" అని చెప్పుకొచ్చాడు.     
Tags:    

Similar News