విభిన్నమైన కథలకు తెలుగు ప్రేక్షకులు పట్టంకడుతున్న సమయమిది. దీంతో ప్రతీ దర్శకుడు, హీరో కొత్త తరహా కథలతో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇదే సమయంలో వాస్తవిక సంఘటనల ఆధారంగా ప్రాంతీయతకు అద్దంపట్టే సినిమాలకు కూడా ఆదరణ పెరుగుతోంది. జాన పదాలని, జన పదాలని కూడా ఈ తరహా సినిమాల ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేస్తూ పల్లెటూరి మట్టివాసనల పరిమళాలని వెండితెరపై ఆవిష్కరిస్తూ ఆకట్టుకుంటున్నారు.
ఈ తరహాలో చిత్రాల్లో రెండేళ్ల క్రితం అంటే 2020లో వచ్చిన 'పలాస 1978' మూవీ మంచి ఆదరణని సొంతం చేసుకుంది. కుల వివక్ష నేపథ్యంలో పలాసలో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా ఈమూవీని తెరకెక్కించి తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసల్ని సైతం సొంతం చేసుకున్నారు.
ఇదే సినిమా యంగ్ హీరో రక్షిత్ అట్లూరికి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. శ్రీకాకుళం యాసలో సాగే పల్లెపదాలని కూడా ఈ మూవీలో పరిచయం చేశారు. రఘు కఉంచె పాడిన 'నాది నక్కిలెసు గొలుసు' ఇప్పటికీ టాప్ హిట్ లలో నిలిచి సందడి చేస్తోంది.
ఈ సినిమాతో వాస్తవిక కథలని తెరకెక్కించడంతో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న దర్శకుడు కరుణ కుమార్ మలి ప్రయత్నంగా కూడా ఇలాంటి యదార్ధ కథనే ఎంచుకుని 'శ్రీదేవి సోడా సెంటర్' మూవీని తెరకెక్కించాడు.
పరువు హత్య నేపథ్యంలో సాగిన ఈ మూవీలో సుధీర్ బాబు, ఆనంది జంటగా నటించారు. 70 ఎం.ఎం. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి నిర్మించిన ఈ మూవీ గత ఏడాది ఆగస్టులో విడుదలై హృద్యమైన ప్రేమకథగా ఆకట్టుకుంది. దర్శకుడు కరుణ కుమార్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ మూవీ తరువాత కరుణ్ కుమార్ తరువాత సైలెంట్ అయిపోయిన కరుణ కుమార్ సైలెంట్ గానే కొత్త చిత్రాన్ని పూర్తి చేశారట.
ఎస్ ఆర్ టీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ రామబ్ తళ్లూరి ఈ మూవీని నిర్మించారు. మళ్లీ యాదార్ధ కథనే కరుణ్ కుమార్ ఈ మూవీకీ ఎంచుకున్నాడా? .. హీరో హీరోయిన్, నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరు? వంటి వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారట.