బాహుబ‌లి దిశా నిర్ధేశం మార్చేసింది

Update: 2015-09-04 11:25 GMT
''తెలుగు సినిమా ద‌శ‌, దిశల‌ను ఒక్క సినిమా మార్చేసింది. బాహుబ‌లి అసాధార‌ణ విజ‌యం అంద‌రిపై ప్ర‌భావం చూపిస్తోంది ఇప్పుడు. వార్ ఎపిక్ సినిమాలు ఏవి తెర‌కెక్కినా ఆ సినిమాకి క్రేజు జాతీయ స్థాయిలో పెరిగేలా చేసింది. రాజ‌మౌళి ప్ర‌భావం అంద‌రు ద‌ర్శ‌కుల‌పైనా ప‌డింది. అత‌డి డేర్‌ స్టెప్ వ‌ల్లే ఇదంతా'', అంటున్నారు దర్శకుడు క్రిష్‌. త్వరలోనే 'కంచె' సినిమాతో వస్తున్న ఆయన బాహుబలి చేసిన మేలును ఎక్సప్లయిన్‌ చేశారు.

''బాహుబ‌లి విజ‌యం వ‌ల్ల ద‌ర్శ‌క‌నిర్మాత‌ల్లో న‌మ్మ‌కం, దైర్యం పెరిగాయి. ఇక ముందు మాసివ్ బ‌డ్జెట్ల‌తో భారీ పీరియ‌డ్ సినిమాల్ని తెర‌కెక్కించ‌వ‌చ్చ‌న్న న‌మ్మ‌కం పెంచింది. బాధ్య‌త‌లు పెరిగాయి. ఆలోచ‌నల ప‌రిధి విస్త‌రించింది. తెలుగు సినిమా జాతీయ సినిమాని ఢీకొట్టే రోజొచ్చింది. కంచె ట్రైల‌ర్ చూసి రాజ‌మౌళి ప్ర‌శంసించ‌డం ఆనందాన్నిచ్చింది. ఈ సినిమా కోసం ఎంతో ఎఫ‌ర్ట్ పెట్టి ప‌నిచేశా. క‌థ కోసం  బోలెడంత రీసెర్చ్ చేశాను. అసాధార‌ణ‌మైన ప్ర‌య‌త్నం చేశాను. ఇది అంద‌రికీ న‌చ్చే సినిమా. పూర్తి క్లారిటీతో విజ‌న్‌తో చేసిన సినిమా ఇది''  అంటూ క్రిష్ చెప్పారు.  వార్ ఎపిక్ సినిమాలు, పీరియాడిక్ సినిమాలు దూసుకొచ్చే స‌మ‌యం ఆస‌న్న‌మైంది అని క్రిష్ సంకేతాలిచ్చాడు. అంటే ఇక నుంచి మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లంతా అలాంటి క‌థ‌ల కోసం రీసెర్చులు మొద‌లు పెడ‌తారు అని చెప్ప‌క‌నే చెప్పాడు. ఇది మంచి ప‌రిణామ‌మే..

చ‌రిత్ర తీసుకున్నా, మ‌న పురాణాల్ని వెతికినా బోలెడ‌న్ని క‌థ‌లు ఉన్నాయి. అయితే ఇటీవ‌లి కాలంలో లేటెస్ట్ ట్రెండ్ అంటూ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్లు త‌ప్ప వేరే కొత్త జోన‌ర్ సినిమా తెలుగు లో చూడ‌లేక‌పోతున్నాం. కుళ్లు జోకులు, పిచ్చి అరుపులు త‌ప్ప వేరే విజువ‌ల్స్ క‌నిపించ‌డం లేదు. రాజ‌మౌళి, క్రిష్‌, సుకుమార్ లాంటి ట్యాలెంటెడ్ ద‌ర్శ‌కులు తెలుగు సినిమాని మ‌రింత అడ్వాన్స్ స్టేజుకి తీసుకెళ్లాల‌ని కోరుకుందాం.
Tags:    

Similar News