ట్యాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్.. ఇప్పుడు పెళ్లికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే అమ్మాయిని చూసేయడం, ఒకరికికొకరు నచ్చడం కూడా పూర్తైపోయాయి. ఈ ఏడాది ఆగస్ట్ లోనే పెళ్లి చేసేసుకోబోతున్నాడు కూడా. వధువు పేరు వి.రమ్య. ఈమె ఒక డాక్టర్. ఇది పెద్దలు కుదిర్చిన సంబంధమే. ఒకరితో ఒకరు మాట్లాడుకున్నాక.. తమ ఇష్టాన్ని ఇరువైపులా తల్లిదండ్రులకు కూడా చేరవేయడంతో.. పెళ్లికి ముహూర్తం రెడీ అవుతోంది.
తన కెరీర్ ప్రారంభం నుంచి సరైన గుర్తింపు పొందేందుకు క్రిష్ ప్రయత్నిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే.. గమ్యం - వేదం చిత్రాలకు గాను ఈ దర్శకుడికి పేరు వచ్చినా.. అవార్డులు మాత్రం పొందలేకపోయాడు. కానీ గతేడాది తీసిన కంచె చిత్రంతో జాతీయ అవార్డు కూడా సాధించడంతో.. పెళ్లికి తన సుముఖతను అమ్మకు చెప్పాడు క్రిష్. మళ్లీ కొడుకు మనసు మార్చుకోకుండానే పెళ్లి చేసేయాలనే ఉద్దేశ్యంతో ఆమె వెంటనే సంబంధాలు చూసి, రమ్య దగ్గర ఆగింది.
క్రిష - రమ్యలు ఒకరినొకరు ఇష్టపడ్డంతో పెళ్లి ముహూర్తానికి అంతా సిద్ధమవుతోంది. రీసెంట్ గా క్రిష్ అమ్మగారికి క్యాన్సర్ ట్రీట్ మెంట్ జరగ్గా.. వీరి కుటుంబంలో ఇతనే పెద్ద కొడుకు. క్రిష్ తమ్ముడు ఇప్పటికే పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయాడు. నందమూరి బాలకృష్ణతో గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాన్ని తీయడం ద్వారా.. తన కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు క్రిష్.