జాతిరత్నంకి ఇప్పటికైనా తత్వం బోధపడిందా?

Update: 2022-10-24 00:30 GMT
జాతిరత్నాలు సినిమా తర్వాత దర్శకుడు అనుదీప్‌ ఒక్కసారిగా స్టార్‌ అయ్యాడు అనడంలో సందేహం లేదు. ఆ సినిమా ప్రమోషన్‌ సమయంలో ఆయన ప్రవర్తన వల్ల సోషల్‌ మీడియాలో ఇంకాస్త ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకుంది. జాతిరత్నాలు తర్వాత ఆయన సినిమా ఏమై ఉంటుందా అనుకుంటున్న సమయంలో శివ కార్తికేయన్ తో సినిమా ప్రకటించాడు.

టాలీవుడ్‌ లో ఎంతో మంది ఫిల్మ్‌ మేకర్స్ మరియు యంగ్‌ హీరోలు అనుదీప్ తో వర్క్ చేసేందుకు ఆసక్తి చూపించారు. ఆ సమయంలో తెలుగు లో ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న శివ కార్తికేయన్ కి అనుదీప్ తగిలాడు. మరో జాతిరత్నం సినిమాను చేయాలని శివ కార్తికేయన్ కు కాస్త అటు ఇటుగా అదే ఎంటర్ టైన్మెంట్‌ తో సాగే ప్రిన్స్ సినిమా కథను వినిపించాడు.

జాతిరత్నాలు సినిమా సక్సెస్ అయ్యింది కనుక శివ కార్తికేయన్ నమ్మకం ఉంచాడు. అయితే ప్రతి సారి కూడా మ్యాజిక్‌ రిపీట్‌ అవ్వదు. జాతిరత్నాలు కథ అందులో నటీ నటులు నేపథ్యం టైమ్‌ ఇలా అన్ని కలిసి రావడం వల్ల భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కానీ ఇప్పుడు అదే తరహా ఎంటర్‌ టైనర్‌ ను ప్రేక్షకులు ఆధరిస్తారు అంటే కచ్చితంగా సాధ్యం కాదు.

ప్రిన్స్ సినిమాకు ముందే అనుదీప్‌ సగం దర్శకత్వం వహించిన ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో సినిమా వచ్చింది. ఆ సినిమా నిరాశ పరిచింది. దర్శకత్వం అనుదీప్ టైటిల్‌ కార్డ్‌ వేయలేదు కాని కథ మాత్రం అనుదీప్ దే అంటూ టైటిల్ కార్డు వేయడం జరిగింది. ఆ సినిమా ఫ్లాప్‌ క్రెడిట్‌ ఎంత కాదన్నా అనుదీప్‌ కే చెందుతుంది.

ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో సినిమా ఫ్లాప్‌ నుండి బయట పడుతాను అనుకుంటూ ప్రిన్స్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ప్రిన్స్ కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశ పర్చింది. తెలుగు తో పాటు తమిళంలో కూడా ఈ సినిమా విడుదల అయ్యింది. అక్కడ ఇక్కడ కూడా వసూళ్ల విషయంలో నిరాశే మిగిలింది అనడంలో సందేహం లేదు.

రెగ్యులర్ సినిమాలు కాకుండా కొత్తగా ఉండే సినిమాలను జనాలు ఆధరిస్తారు. అందులో భాగంగానే జాతిరత్నాలు సినిమాను జనాలు ఆధరించారు. కానీ ఎప్పుడైతే జాతిరత్నాలు సినిమా తరహాలోనే మళ్లీ అదే కథ మరియు కథనాలతో సినిమాలు వస్తున్నాయి అప్పుడు అవి పాత చింతకాయ పచ్చడి సినిమాలు అవుతాయి.

కనుక వాటిని జనాలు ఆదరించరు అనే విషయాన్ని అనుదీప్ గ్రహించాలి. ప్రిన్స్ సినిమా తో అయినా ఆ తత్వం అనుదీప్ కు బోధ పడితే తదుపరి సినిమా విషయంలో అయినా మళ్లీ కొత్తగా ప్రయత్నిస్తాడేమో చూడాలి.
Tags:    

Similar News