కెరియర్ ఆరంభంలో యూత్ కి నచ్చే కథలను మాత్రమే చేస్తూ వచ్చిన మారుతి, ఆ తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించే కథలను రెడీ చేస్తూ వస్తున్నారు. తన కథలకి కామెడీతో పాటు మాస్ టచ్ ఇవ్వడం కూడా ఆయనకి బాగా తెలుసు. ఆయన తాజా చిత్రమైన 'పక్కా కమర్షియల్' జూలై 1వ తేదీన థియేటర్లకు రానుంది. గోపీచంద్ - రాశి ఖన్నా జంటగా నటించిన ఈ సినిమా, ప్రెస్ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. ఈ వేదికపై మారుతి మాట్లాడుతూ .. "ఈ సినిమా నిర్మాతల్లో బన్నీ వాసు ఎంత కమర్షియల్ గా ఉంటాడో .. యూవీ వంశీ అంత నాన్ కమర్షియల్ గా ఉంటాడు.
ఇక నా విషయానికి వస్తే .. నాలో ఈ రెండు లక్షణాలు ఉన్నాయి. కమర్షియల్ వెళ్లి దెబ్బతినేసి నాన్ కమర్షియల్ గా నేను బయటికి వస్తుంటాను. నేను గోపీచంద్ సినిమాలు చూశానుగానీ, ఆయనతో ట్రావెల్ కాలేదు. నేను ఈ కథను యూవీ వంశీకి చెబితే .. గోపీచంద్ కి బాగుంటుంది .. వెళ్లి చెప్పమన్నారు. కథ బన్నీవాసుకి .. అరవింద్ గారికి కూడా నచ్చడంతో గోపీచంద్ గారికి వినిపించాను. సింగిల్ సిట్టింగ్ లోనే ఆయన ఓకే చెప్పారు. అలా ఈ సినిమా పట్టాలెక్కింది. ఈ సినిమా విషయంలో ఖర్చు పరంగా రాజీ పడలేదు. భారీ సెట్టింగులు .. సెటప్పులతో నడిచింది.
ఒక మంచి సినిమా తీశాము అనే నమ్మకం మాకు వచ్చింది .. మీ అందరినీ తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుంది. నా సినిమాల నుంచి మీరంతా ఆశించే కామెడీ ఉంటుంది. గోపీచంద్ గారిని నుంచి ఆశించే యాక్షన్ కూడా ఉంటుంది. అన్నీ మిక్స్ చేసి తీసిన కమర్షియల్ సినిమా ఇది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడమని మీకు తెలిసిన వాళ్లతో చెబుతారు. ఈ సినిమాలో రాశి ఖన్నాతో పాటు సత్యరాజ్ .. రావు రమేశ్ అంతా ఉన్నారు. 'ప్రతిరోజూ పండగే' సినిమాలోని ఆర్టిస్టులు ఎక్కువగానే ఉన్నా ఆ కథ వేరు .. ఈ కథ వేరు .
రాశి ఖన్నా ఈ సినిమాలో చాలా బాగా చేసింది .. చాలా ఎనర్జీతో తో చేసింది. అది ఈ సినిమాకి చాలా హెల్ప్ అయింది. గోపీచంద్ ఈ సినిమాలో చాలా అందంగా కనిపిస్తారు. ఈ సినిమా ఇంతబాగా తీయడానికి నాకు ఆయన ఎంతో సహకరించారు. ఈ సినిమా కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెబుతున్నాను" అంటూ ముగించారు.