మళ్లీ జబ్బునే నమ్మావా మారుతీ!!

Update: 2017-08-24 09:15 GMT
ఒక్కో దర్శకుడికి ఒకో తరహా మేకింగ్ స్టైల్ ఉంటుంది. అలాగే హీరో కేరక్టరైజేషన్ విషయంలో కూడా.. ఆయా దర్శకులకు అనుగుణంగానే హీరోలు ప్రవర్తిస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్.. పూరీ సినిమాల్లో హీరోలు హైపర్ ఎనర్జిటిక్ గా బిహేవ్ చేయడం చూస్తూనే ఉంటాం. దర్శకుడు మారుతి కూడా తన హీరోల విషయంలో ఓ ట్రెండ్ కు అలవాటు పడుతున్నాడు.. చేస్తున్నాడు.

తన సినిమాలో హీరోను సాధారణంగానే చూపించినా.. అతనికి ఏదో ఒక జబ్బు అంటగడుతున్నాడు మారుతి. అలాగని ఆ జబ్బు ఏమీ విపరీతంగా ఉండదు సరికదా.. కథలో ఓ పార్ట్ అయిపోతోంది. భలేభలే మగాడివోయ్ చిత్రంలో నానికి మతిమరుపు జబ్బు అంటగట్టిన మారుతి.. ఎంతగానో నవ్వులు పూయించడమే కాదు.. అంతకు మించిన సక్సెస్ కూడా అందుకోగలిగాడు. ఇప్పుడు మరో యంగ్ హీరో శర్వానంద్ తో మహానుభావుడు చిత్రం చేస్తున్నాడు మారుతి. ఇందులోనూ హీరోకు ఓ జబ్బు ఉంది. దాని పేరు అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. పేరుకు పెద్ద జబ్బే కానీ.. దీన్ని లైట్ గానే ఉపయోగించుకున్నాడట దర్శకుడు. ఈ జబ్బు ఉన్నవాళ్లు కొన్ని అంశాలపై మరీ ఎక్కువ పట్టు పట్టేస్తుంటారు. అలాగే శర్వా పాత్ర ఇందులో శుభ్రత అనే అంశంపై బాగా కాన్సంట్రేట్ చేస్తుందని మనకు టీజర్ చూస్తే తెలుస్తోంది. సినిమా కథకు.. ఈ పరిశుభ్రతకు బోలెడంత లింక్ కూడా ఉంటుందట. అలాగే మోడీ ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ్ భారత్ ను కూడా చాలా తెలివిగా వాడేసుకుని.. తన కథలో భాగం చేసేశాడట మారుతి.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన మహానుభావుడు.. దసరా సందర్భంగా రిలీజ్ కానున్నాడు. మరి తన శుభ్రతతో ఏ స్థాయిలో మారుతి స్టైల్ నవ్వులను శర్వా చిందించాడో చూడాలి.
Tags:    

Similar News