సినీ నటి శ్రీరెడ్డి ఆరోపణ మినహా.. సినీ నటుడు కమ్ దర్శకుడు రాఘవ లారెన్స్ పై వేలెత్తి చూపించే మరక ఏదీ కనిపించదు. శ్రీరెడ్డి వ్యవహారంలో మిగిలిన వారికి భిన్నంగా లారెన్స్ రియాక్ట్ కావటం తెలిసిందే. ఈ విషయాన్ని పక్కన పెడితే.. భారీ వర్షాలతో.. వరదలతో అతలాకుతలమైన కేరళకు తన వంతు సాయంగా లారెన్స్ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది.
భారీగా నష్టపోయిన కేరళకు తమ వంతు సాయం అందించేందుకు వీలుగా ఇప్పటికే పలువురు సినీ రంగ ప్రముఖులు సాయాన్ని ప్రకటించినా.. వారెవరూ చేయని రీతిలో లారెన్స్ భారీ మొత్తాన్ని తన విరాళంగా ప్రకటించిన సంచలనం సృష్టించారు. కోటి రూపాయిల మొత్తాన్ని కేరళ ప్రభుత్వానికి తాను అందజేయనున్నట్లు వెల్లడించారు.
ఇప్పటివకూ పలువురు సినీ రంగానికి చెందిన ప్రముఖులు కేరళకు తమ వంతు సాయాన్ని ప్రకటించారు కానీ.. వారెవరూ లారెన్స్ స్థాయిలోరియాక్ట్ కాలేదని చెప్పాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. విపత్తుతో కేరళ నష్టపోయిన వైనం తనను కదిలించి వేసిందని.. అందుకే కేరళలో ఎక్కడ తీవ్రంగా దెబ్బ తిన్నదో అక్కడకు తాను స్వయంగా వెళ్లి తన వంతు పని తాను చేస్తానని వెల్లడించారు.
దీనికి సంబంధించి ఇప్పటికే తాను కేరళ సీఎం అపాయింట్ మెంట్ తీసుకున్నానని.. ఆయన సూచన మేరకు వారు చెప్పిన ప్రాంతానికి వెళ్లి సర్వీస్ చేయనున్నట్లు చెప్పారు. వాస్తవానికి ఇంతకు ముందే ఈ విషయాన్ని చెప్పినా.. సహాయ కార్యక్రమాలకు అడ్డంకిగా ఉంటుందన్న కారణంగా వద్దని చెప్పారని.. తానిప్పుడు కేరళకు వెళ్లి సాయం చేయాలని భావిస్తున్నట్లుచెప్పారు. చేతిలో ఉన్న డబ్బును విరాళంగా ఇవ్వటం అందరూ చేసేదే.. అందుకు భిన్నంగా తనకు తానుగా సర్వీస్ చేయాలని భావిస్తున్న లారెన్స్ ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారి.. అందరి అభినందనల్ని పొందుతోంది.