సుధ కొంగర.. బాలీవుడ్లో, కోలీవుడ్లో ప్రస్తుతం ఈ పేరు హాట్ టాపిక్ అవుతోంది. పది రోజుల కిందట హిందీలో ‘సాలా ఖడూస్’గా, తమిళంలో ‘ఇరుది సుట్రు’గా రిలీజైన సంచలన విజయం సాధించిన సినిమాకు దర్శకురాలు ఈమే. ఈ పేరు చూస్తే ఆమె తెలుగమ్మాయేమో అన్న అనుమానం రావడం సహజం. ఆ అనుమానం నిజమే. ఆమె అచ్చ తెలుగు అమ్మాయే. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి ఆమె సొంత ఊరు. చెన్నైకి వెళ్లి అక్కడ సినిమాల్లో ఓనమాలు నేర్చుకుని అక్కడే స్థిరపడింది సుధ. లేడీ డైరెక్టర్లు సినిమాలు తీయడమే గొప్ప అనుకుంటారంతా. కానీ రాజ్ కుమార్ హిరాని లాంటి లెజెండరీ డైరెక్టర్ని మెప్పించి.. ఆయన నిర్మాణంలో సినిమా చేసి.. ఆ సినిమాను విజయవంతం చేసి ఇందరి ప్రశంసలు అందుకోవడమంటే మాటలు కాదు.
ఐతే చాలామంది సుధకు ఇదే తొలి సినిమా అనుకుంటున్నారు. కానీ ఆమె ఆల్రెడీ రెండు సినిమాలకు దర్శకత్వం వహించింది. అందులో ఒక తెలుగు సినిమా కూడా ఉంది. అసలు దర్శకురాలిగా ఆమె తొలి సినిమా తెలుగులోనే చేసింది. ఆ సినిమా పేరు.. ఆంధ్రా అందగాడు. కృష్ణభగవాన్ - సుమన్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఇది. ఇలాంటి సినిమా ఒకటి తెలుగులో తెరకెక్కిందన్న సంగతి కూడా మన జనాలకు తెలియదు. అలాంటి సినిమాతో దర్శకురాలిగా పరిచయమైన సుధ.. ఆ తర్వాత తమిళంలో శ్రీకాంత్ (మనదగ్గర శ్రీరామ్ అంటారు) హీరోగా ‘ద్రోహి’ అనే ఇంకో సినిమా చేసింది. దాంతో ఓ మోస్తరుగా పేరు తెచ్చుకున్న సుధ.. ‘సాలా ఖడూస్’తో తన ఫేట్ పూర్తిగా మార్చేసుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ తో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తోంది సుధ.