జయంతి నాటికి ఎన్టీఆర్ బయోపిక్

Update: 2017-10-14 05:40 GMT
టీనేజ్ ప్రేమ నుంచి కాలేజ్ ప్రేమ వరకు రకరకాల లవ్ స్టోరీలు తీసి వరస ఎదురుదెబ్బలు తిన్న డైరెక్టర్ తేజ స్టయిల్ మార్చి నేనే రాజు నేనే మంత్రితో ఫుల్ లెంగ్త్ పొలిటికల్ మూవీ తీసి శభాష్ అనిపించుకున్నాడు. నేనే రాజు నేనే మంత్రి సినిమా ప్రశంసలతో పాటు డైరెక్టర్ గా తేజకు బోలెడెు కొత్త అవకాశాలు తెచ్చి పెట్టింది. పొలిటికల్ మూవీ బాగా తీస్తాడనే పేరు రావడంతో లెజండరీ నటుడు ఎన్.టి.రామారావు జీవిత గాథతో తెరకెక్కించే సినిమాకు తేజను డైరెక్టర్ గా ఎంచుకున్నారు.

ప్రస్తుతం తేజ ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. అయితే ఎన్టీఆర్ బయోపిక్ కన్నా ముందు విక్టరీ వెంకటేష్ తో సినిమా తీయాలన్నది తేజ ప్లానింగ్. ‘‘ప్రస్తుతం ఈ రెండు సినిమాలకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఏ సినిమాకు ముందు స్క్రిప్ట్ సిద్ధమైతే ఆ మూవీ స్టార్ చేస్తా. లేదంటే రెండు సినిమాల షూటింగ్ ఒకేసారి కూడా చేస్తా. మే 28 ఎన్టీఆర్ జయంతి నాటికి ఆయన జీవిత గాథతో తీసే సినిమా పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు’’ తేజ చెబుతున్నాడు.  ఈ మూవీని బాలకృష్ణ - విష్ణు ఇందూరి - సాయి కొర్రపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఎన్టీఆర్ జీవిత గాథతో తీసే సినిమాలో నటించే పాత్రధారుల ఎంపిక బాధ్యతను ఓ ఏజెన్సీకి అప్పగించారు. వీలైనంత వరకు అదే పోలికలతో ఉండే నటులను ఆ పాత్రలకు ఎంపిక చేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఒకేసారి రెండు సినిమాలు తీస్తానని తేజ కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడంటే నేనే రాజు.. నేనే మంత్రి హిట్ తో వచ్చిన కాన్ఫిడెన్స్ ఆ రేంజిలో ఉందన్న మాట.


Tags:    

Similar News