'జయం' తర్వాత మళ్లీ ఇంత కాలానికి..

Update: 2020-01-29 06:39 GMT
గోపీచంద్ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా ‘జయం’. అంతకుముందు అతను హీరోగా ‘తొలి వలపు’ అనే సినిమా చేశాడు. అది దారుణమైన ఫలితాన్నందుకుంది. ఆరంభంలోనే గోపీ కెరీర్‌కు బ్రేక్ పడిపోయింది. ఆ దశలో గోపీని హీరోగా పెట్టి సినిమా తీయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. అలాంటి టైంలో తేజ అతణ్ని ‘జయం’ సినిమాతో విలన్ని చేశాడు. తేజ మీద నమ్మకంతో ఆ పాత్ర చేసి గోపీ తనలోని కొత్త కోణాన్ని చూపించాడు. అప్పట్లో గోపీ క్యారెక్టర్ ఇండస్ట్రీలో ఒక సంచలనం. ఆ తర్వాత ‘వర్షం’లోనూ అతను ప్రతినాయక పాత్ర చేశాడు. అది కూడా క్లిక్ అయింది. ఆపై మళ్లీ ‘యజ్ఞం’ సినిమాతో హీరోగా రీఎంట్రీ ఇచ్చి హిట్టు కొట్టాడు గోపీ. తర్వాత అతను వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. చాలా ఏళ్లు హీరోగా మంచి స్థిితిలోనే కొనసాగాడతను. ఐతే ఈ మధ్య గోపీ కెరీర్ అంత బాగా లేదు.

వరుస ఫ్లాపులతో అల్లాడుతున్నాడు. త్వరలోనే ‘సీటీమార్’ అనే సినిమాతో పలకరించబోతున్నాడు గోపీ. దీని ఫలితం ఏమవుతుందో చూడాలి. దీని తర్వాత గోపీ.. తేజతో ఓ సినిమా చేయడానికి అంగీకరించినట్లు సమాచారం. ‘సీత’తో షాక్ తిన్న తేజ.. రానాతో ఒక సినిమాను లైన్లో పెట్టే ప్రయత్నంలో ఉన్నాడు. ఆ చిత్రానికి ‘రాక్షస రాజ్యంలో రావణుడు’ అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉంది. దీని తర్వాత గోపీతో తేజ సినిమా ఉంటుందట. ఇంతకుుముందు గోపీని విలన్‌ గా పెట్టి లైఫ్ ఇచ్చిన తేజ.. ఈసారి హీరోగా అతడికి లైఫ్ ఇస్తాడేమో చూడాలి. ఆ మాటకొస్తే తేజకు కూడా ఇప్పుడు బ్రేక్ చాలా అవసరం. మరి వీళ్లిద్దరూ కలిసి ఒకరికొకరు హిట్ ఇచ్చుకుంటారేమో చూడాలి. గోపీ నుంచి గత ఏడాది వచ్చిన ‘చాణక్య’ అతడి కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అతడి కొత్త చిత్రం ‘సీటీమార్’ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Tags:    

Similar News