నేనే రాజు నేనే మంత్రి మూవీ హిట్ తర్వాత దర్శకుడు తేజ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయాడు. టిపికల్ సబ్జెక్టులను పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేయగలడనే గుర్తింపు సాధించుకున్నాడు. తన జోనర్ లో సూపర్బ్ గా మూవీస్ తీసే తేజ.. ఆ జోనర్ దాటి బయటకు వస్తే.. మరింతగా రీసెర్చ్ చేసి పర్ఫెక్ట్ ఔట్ పుట్ ఇవ్వగలడని అనిపించుకున్నాడు.
అందుకే సీనియర్ హీరోలు.. ఇప్పుడు తేజకు సినిమా ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ నటించబోతున్న ఎన్టీఆర్ బయోపిక్.. వెంకటేష్ తో ఓ చిత్రానికి తేజ కమిట్ అయ్యాడని వార్తలు ఉన్నాయి. అయితే.. వీటిలో తేజ ఏది మొదట మొదలుపెట్టనున్నాడనే విషయంపై క్లారిటీ లేదు. అయితే.. నేనే రాజు నేనే మంత్రి ద్వారా అవకాశం ఇచ్చిన సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ కే తన మరుసటి చిత్రం చేస్తాడట తేజ. అంటే వెంకటేష్ తోనే సినిమా చేస్తాడన్న మాట. ఇప్పటికే వెంకీ మూవీకి సంబంధించి మ్యూజిక్ పనులు కూడా ప్రారంభమైపోయాయని తెలుస్తోంది.
మరోవైపు బాలయ్య మూవీకి కూడా తేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. ఈ సినిమా పనులు కూడా జరగనున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుండగా.. ఆ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ కు కూడా తేజ వర్క్ చేసే అవకాశం ఉంది. కుదిరితే రెండు ప్రాజెక్టులు ఒకేసారి హ్యాండిల్ చేసే అవకాశాలను పరిశీలిస్తున్నా.. మొదట వెంకీ.. తర్వాత బాలయ్య సినిమాలను తేజ తెరకెక్కించనున్నాడనే మాట మాత్రం నిజం.