వరుణ్ తేజ - సాయిధరమ్ తేజ - తేజ కాంబినేషన్

Update: 2017-09-03 09:49 GMT
రానాతో తీసిన నేనే రాజు నేనే మంత్రికి హిట్ టాక్ రావడంతో తేజ మళ్లీ గాఢిలోకి వచ్చేశాడా! అవుననే అంటున్నారు సినీ జనాలు. ఈ సినిమా కథ తిమ్మారెడ్డి అనే రైటర్ దగ్గర నుంచి తేజ తీసుకున్నాడని వార్తలు వస్తున్నా, అవేవి పట్టించుకోకుండా తన నెక్ట్స్ మూవీని సెట్ చేసుకునే పనిలో తేజ ఉన్నాడని తెలిసింది. యూనైటెడ్ మూవీస్ పతాకం పై పరచూరి ప్రసాద్ నిర్మాతగా తేజ డైరెక్షన్ లో ఓ సినిమా రెడీ అవుతుందని సమాచారం. ఈ సినిమాలో మెగా హీరోలు సాయిధరమ్ తేజ్ - వరుణ్ తేజ్ కలిసి నటిస్తారనే టాక్ నడుస్తుంది. ఇద్దరు యంగ్ హీరోలతో మల్టీస్టారర్ తేజ ప్లాన్ చేస్తున్నట్లుగా గతంలో వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో ఇటీవలే తేజ అండ్ టీమ్ వరుణ్ తేజ - సాయిధరమ్ తేజలను కలవడంతో వీరిద్దరే తేజ తెరకెక్కించే మల్టీస్టారర్ లో్ హీరోలనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం పై అటు సాయిధరమ్ తేజ్ కానీ ఇటు వరుణ్ తేజ్ వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తేజ కూడా మల్టీస్టారర్ ఉంటుందు కానీ ఈ ఇద్దరే అనే విషయం పై క్లారిటీ ఇవ్వలేదు. అయితే యునైటెడ్ మూవీస్ వారు మాత్రం తేజతో నెక్ట్స్ మూవీ ఉంటుందని అంటున్నారు. మరో వైపున వరుణ్ తేజ కాల్సీట్స్ కూడా తమ దగ్గర ఉన్నట్లుగా చెబుతున్నారు. దీంతో వరుణ్ తేజ్ - తేజ కాంబినేషన్ లో సినిమా అయితే కన్ఫామ్ అనే టాక్ నడుస్తుంది. ఇందులో సాయిధరమ్ కూడా ఉన్నాడనే సంకేతాలు రావడంతో మెగా అభిమానులు ఈ సినిమా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి త్వరలోనే ఈ క్రేజీ కాంబినేషన్ కుదిరి ఓ మెగా మల్టీస్టారర్ రెడీ అవుతుందేమో చూద్దాం.
Tags:    

Similar News