ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన యాక్షన్ డ్రామా `పుష్ప`. స్టార్ డైరెక్టర్ సుకుమార్ అత్యంత భారీ స్థాయిలో రూపొందించిన ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలై అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీ ఉత్తరాదిలో హిందీ బెల్ట్ లో రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టింది. హిందీ బెల్ట్ లో ఏకంగా ఈ మూవీ రూ. 100 కోట్లకు మించి రాబట్టి అక్కడి ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురి చేసింది.
దీనిపై బాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చే నడిచింది. ఇదిలా వుంటే ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం తెలిసిందే. త్వరలో ఈ సినిమాకు సీక్వెల్ గా `పుష్ప 2` సెట్స్ పైకి రాబోతోంది. ఇప్పటికే ఫైనల్ డ్రాఫ్ట్ ని పూర్తి చేసిన సుకుమార్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని మొదలు పెట్టాడు. రీసెంట్ గా పూజా కార్యక్రమాలు నిర్వహించిన మేకర్స్ అక్టోబర్ 10 నుంచి రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టబోతున్నారు.
ఇదిలా వుంటే ఈ సినిమా వల్ల నష్టాలే వచ్చాయి కానీ లాభాలు రాలేదంటూ దర్శకుడు తేజ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించడం సంచలనంగా మారింది. ఈ మూవీకి మించి `రాధేశ్యామ్` కొన్ని చోట్ల లాభాల్ని తెచ్చిపెట్టిందని తేజ చెప్పడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రభాస్ నటించిన `రాధేశ్యామ్` ఐదు భాషల్లో విడుదలై డిజాస్టర్ అనిపించుకున్న విషయం తెలిసిందే.
అయితే డిజాస్టర్ అనిపించుకున్న `రాధేశ్యామ్` కొన్ని చోట్ల లాభాల్ని తెచ్చిపెట్టిందని, పాన్ ఇండియా హిట్ అనిపించుకున్న `పుష్ప` తెలుగులో చాలా చోట్ల నష్టాలని తెచ్చిపెట్టిందని దర్శకుడు తేజ అంటున్నారు. బాంబే `మండీ మే హిట్ హువాతో హిట్ హువా` అంటారు. మండీలో హిట్ అయితే చాలు వాళ్లకి. `పుష్ప` ముంబైలో ఆడింది.. వాళ్ల దృష్టిలో దేశం అంతా ఆడినట్టే. ఆంధ్రాలోఎంత డెఫిషీట్ అంటే ఇంకా డబ్బులు తిరిగి కట్టాల్సినంత అని `పుష్ఫ` పై షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు తేజ.
అంతే కాకుండా మాకు తెలిసిన వాళ్ల థియేటర్ లో `పుష్ప`ని రిలీజ్ చేశాం. పెట్టిన పెట్టుబడి కంటే తక్కువ వచ్చింది. దానికంటే `రాధేశ్యామ్` మెరుగైన కలెక్షన్స్ ని రాబట్టింది. అంతే కాకుండా `ఆచార్య`కు నష్టాలు వచ్చాయి. ట్రైలర్ చూసి ప్రేక్షకుడు సినిమా చూడాలా.. వద్దా నిర్ణయించుకంటున్నాడు. ఎందుకంటే పెద్ద మొత్తం ఖర్చు చేయాల్సి వస్తోంది కాబట్టి థియేటర్ కు రావాలంటే సవాలక్షా ఆలోచిస్తున్నాడు` అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.