ఇంకో సీతనా లక్ష్మినా రాధనా ?

Update: 2019-06-17 05:19 GMT
కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందిన సీత ఇటీవలే విడుదలై డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితం నేనే రాజు నేనే మంత్రితో కం బ్యాక్ అయ్యాడని పేరు తెచ్చుకున్న దర్శకుడు తేజ దీంతో మళ్ళీ మొదటికే వచ్చాడనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. ఈ విమర్శలను ఏ మాత్రం లెక్క చేయని తత్వమే నిజానికి తేజను ప్రెజెంట్ జనరేషన్ కు కనెక్ట్ చేయలేకపోతోందన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి.

ఇదిలా ఉండగా తేజ మరోసారి కాజల్ తో ఇంకో ఫిమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్టు తీసే ప్లాన్ లో ఉన్నాడట. ఈమేరకు ఇటీవలే ఓ కథను కూడా వినిపించినట్టు తెలిసింది. ఆశ్చర్యకరంగా కాజల్ స్వయంగా నిర్మించే ఆసక్తి చూపించిందని తెలియడం ఇంకో ట్విస్ట్ . తేజ అంటే కాజల్ కు ప్రత్యేకమైన గౌరవం. టాలీవుడ్ కు లక్ష్మి కళ్యాణంతో పరిచయం చేసిన దర్శకుడిగా కెరీర్ కొంత డల్ గా ఉన్నప్పుడు నేనే రాజు నేనే మంత్రి రూపంలో మరో హిట్ ఇచ్చిన డైరెక్టర్ ఆయన మీదున్న అభిమానాన్ని చాలా సార్లు చెప్పింది కూడా.

సీత ఫెయిల్యూర్ ని మర్చిపోయి పక్కనపెట్టేసి కొత్త స్క్రిప్ట్ మీద వర్క్ చేద్దామని చెప్పిందట. కాకపోతే ఇది వెంటనే సెట్స్ పైకి వెళ్లకపోవచ్చు. తేజ కూడా కొంత టైం తీసుకుని సీతలో దొర్లిన పొరపాట్లను రిపీట్ చేయకుండా ఒకటికి రెండు సార్లు పక్కాగా ఉంది అనుకున్నాకే వచ్చే ఏడాది షూటింగ్ గురించి ఆలోచించే ప్లాన్ లో ఉన్నారట. సో అధికారికంగా ప్రకటించలేదు కానీ తేజ కాజల్ ల వన్ మోర్ కాంబినేషన్ రెడీ అవుతోందన్న మాట


Tags:    

Similar News