వారం కిందట వచ్చిన నేనే రాజు నేనే మంత్రి సినిమాతో హీరో రానాకి అలాగే డైరెక్టర్ తేజకు మంచి విజయం వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్ కూడా రానా బాగానే చేశాడు . సినిమాలో తన పాత్ర ఎలా ఉండబోతోందో చెబుతూ సినిమాకు ఏ విదమైన ప్రచారం అవసరమో ఆ విదంగా చేసి కలెక్షన్లు కూడా బాగానే సంపాదించాడు. అయితే ఈ సినిమా ప్రమోషన్ టైములో ఒక గమ్మత్తైన ప్రశ్నను అడిగాడు రానా.
‘నేనే రాజు నేనే మంత్రి' కథను నాకే ఎందుకు చెప్పారు నన్నే ఎందుకు హీరోగా అనుకున్నారు? అని అడిగాడు రానా. దానికి తేజ ఏమి చెప్పాడు అంటే “నేనే రాజు నేనే మంత్రి ఒక రెగ్యులర్ హీరో చేయవలిసిన కథ కాదు. ఎందుకంటే ఈ సినిమాలో హీరోకి కొంచెం నెగిటివ్ షేడ్ కూడా ఉంటుంది. సాధారణంగా మన తెలుగు సినిమాలలో హీరోలు మంచి వారై ఉండాలి అందరినీ రక్షిస్తూ ఉండాలి. కానీ ఈ సినిమా ఒక రెగ్యులర్ హీరో ఆలోచించే విదంగా కథ ఉండదు. దీనికి కొంచెం తెలివైన నటుడు కావాలి. అందుకే నేను నిన్ను ఎన్నుకున్నాను. నేను ఇంతకు ముందు చాలా మంది హీరోలతో కలిసి పని చేశాను. వాళ్ళంతా ఒక మూస పద్దతిలో ఆలోచిస్తారు. నువ్వు అయితే ఇమేజ్ గురించి ఆలోచించకుండా చేస్తావు అందుకే నీకు కథ చెప్పాను” అని చెప్పాడు తేజ. పైగా నువ్వు చేసిన ముందు సినిమాలు కూడా ఈ నిర్ణయం తీసుకోవడానికి దోహదపడింది అని రానా కు వివరణ ఇచ్చాడు. రామ్ గోపాల్ వర్మ - పూరీ జగన్నాధ్ - క్రిష్ - రాజమౌళి లాంటి డైరెక్టర్లతో పనిచేసావు కాబట్టి నా పని కొంచెం తేలికైందని చెప్పాడు.
డైరెక్టర్ తేజ సంచలన సినిమాలు తీయడానికే ఫేమస్ కాదు ముక్కుసూటిగా మాట్లాడి సంచలనం సృష్టించిన సందర్భాలు కూడా ఉన్నాయి. తన కెరియర్ తొలినాళ్లలో గొప్ప విజయాలను అందుకున్న తేజ ఆ తరువాత కొన్ని వరుస ఫ్లాప్ లతో డీలా పడ్డాడు. మళ్ళీ నేనే రాజు నేనే మంత్రి సినిమాతో తన మార్క్ సినిమాల డైరెక్ట్ చేసి విజయాన్ని అందుకున్నాడు. మరి తరువాత కూడా హిట్టు కొట్టి ఈ సక్సెస్ ను నిలబెట్టుకుంటాడా?