రెమ్యునరేషన్ తీసుకోలేదు

Update: 2017-08-11 10:09 GMT
సక్సెస్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు పలకరిస్తారు కానీ లైఫ్ లో కంటిన్యూస్ గా ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఏ ఒక్కరు కనీసం చూడటానికి కూడా ఇష్టపడరు. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో ఈ తరహా పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. హీరో అయిన దర్శకుడైన - హీరోయిన్ అయినా ఎవ్వరైనా సరే సక్సెస్ లో ఉంటేనే ఛాన్సులు దక్కించుకోగలరు. కానీ మళ్ళీ గట్టిగా ప్రయత్నించి హిట్ కొట్టాలంటే చాలానే కష్టపడాలి. అలాంటి పరిణామాలను ఎదుర్కొన్న వారిలో ఒకరు.. దర్శకుడు తేజ.

కెరీర్ మొదట్లో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఓ డైరెక్టర్ వల్ల సినిమా ఇంత హిట్ అవుతుందా అని నిరూపించిన దర్శకుడు తేజ. ముఖ్యంగా ఆయన తీసిన జయం అప్పట్లో సంచలనం. అయితే ఆ తర్వాత తేజ కొన్ని తప్పులు చేశానని తనే ఒప్పుకున్నాడు. రీసెంట్ గా ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు ఈ దర్శకుడు. వరుస ఫెయిల్యూర్స్ తర్వాత సినిమాలు చేయడానికి నిర్మాతలు దొరకలేదట. అంతే కాకుండా దొరికిన నిర్మాతలు కూడా రెమ్యూనరేషన్ ఇచ్చే వాళ్ళు కాదట సక్సెస్ లో లేవు కాబట్టి ఇప్పుడే ఇవ్వలేమని, సినిమా రిలీజ్ తర్వాత సక్సెస్ వస్తే ఆలోచిస్తామని చెప్పారట ఈ సీనియర్ దర్శకుడికి. దీంతో చేసేదేమీ లేక సక్సెస్ కావాలి కాబట్టి తన ప్రయత్నం చేసేవాడట తేజ. అయితే తను ఎప్పుడు డైరెక్షన్ లో తప్పులు చేయలేదట కేవలం ప్రేక్షకుడు కొత్త ధనాన్ని కోరుకుంటున్నాడు. స్క్రిప్ట్ విషయంలో మాత్రమే తప్పు చేశానని వివరించాడు.

అలాగే ఆయాన తీసిన నేనే రాజు నేనే మంత్రి గురించి మాట్లాడుతూ.. ఇది టోటల్ గా పొలిటికల్ డ్రామాగా ఉంటుంది అనుకుంటున్నారు కానీ పూర్తిగా అలా ఉండదు ఒక ఫ్యామిలి డ్రామాగా కథ నడుస్తుంది. ఇక కథలో కొన్ని సామాజిక అంశాలు ఉన్నాయని తేజ చెప్పాడు. అలాగే తమిళ్ లో ఈ సినిమాని మొదట రిలీజ్ చేద్దామని అనుకోలేదు కానీ టీజర్ రిలీజ్ చేసిన తర్వాత కొన్ని డైలాగులు అక్కడ పాలిటిక్స్ కి కరెక్ట్ గా సరిపోవడం వల్ల తమిళ్ లో రిలీజ్ చెయ్యాలని డిసైడ్ అయ్యాం. ఇక ఫెయిల్యూర్ ఉన్న తనను రానా ఒప్పుకోవడానికి కారణం కథ అని చెప్పాడు. స్క్రిప్ట్ బావుండడం వల్ల రానా నా బ్యాక్ గ్రౌండ్ ని చూడలేదని చెప్పాడు. అలాగే రానాకి కూడా తన సొంతంగా ఒక భారీ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. తను లీడ్ లో ఉండి నడిపించిన కథ ఇది సో చాలా వరకు కొత్తగా ట్రై చేశాం అందరికి తప్పకుండా నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు తేజ.


Tags:    

Similar News