గోదారోళ్లు ముదిరిపోయారు

Update: 2017-05-28 05:34 GMT
లేడీస్ టైలర్ మూవీతో టాలీవుడ్ పై చెరగని మార్క్ వేసిన వంశీ.. ఇప్పుడు ఆ చిత్రానికి రీమేక్ మాదిరిగా ఉండే సీక్వెల్ 'ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్'ను తెరకెక్కించారు. ఇప్పటికే సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ.. ఇప్పుడు రిలీజ్ కి రెడీ అయిపోయింది. జూన్ 2న థియేటర్లలోకి వస్తున్న ఫ్యాషన్ డిజైనర్ తో పాటు.. గోదారిపై.. ఇండస్ట్రీ జనాలపై బోలెడన్ని కబుర్లు చెబుతున్నారు దర్శకుడు వంశీ.

'లేడీస్ టైలర్ చిత్రాన్ని తీసిన మానేపల్లిలో.. ఒక్క పూట అయినా షూటింగ్ చేయాల్సిందే అని పట్టుబట్టారు ఆ ఊరి జనాలు. అప్పట్లో పెద్దగా షూటింగ్స్ ఉండేవి కావు కానీ.. ఇప్పుడు మా గోదారోళ్లకు అలవాటయిపోయాయి. ఎక్కడైనా కెమేరా కనిపిస్తే చాలు.. సినిమానా సీరియలా అంటూ కూపీ లాగేస్తున్నారు.. అంతగా ముదిరిపోయారు. అయితే నేను ఎక్కడికి వెళ్లినా మా ఇంట్లో షూటింగ్ పెట్టుకోండి అంటుంటారు. ఫేస్ బుక్ లో ఓ లొకేషన్ చూసి ఆరా తీస్తే.. అదో చేపల చెరువు అని తెలిసింది. ముందు ఒప్పుకోలేదు కానీ.. కాస్త బతిమిలాడితే ఒప్పుకున్నారు. గోదారోళ్ల భలే మంచోళ్లండీ' అంటున్నారు వంశీ.

'నేను రాసిన కథల్లో ఉండే ఆర్తి ఆవేదన.. సినిమాల్లో ఉండదని అని ఓసారి అన్నారు బాపు గారు. తాజాగా తమ్ముడు సత్యం "నువ్వు ప్రేమించి సినిమా తీస్తే హిట్టే" అన్నారు' వంశీ. అంతకు అంత ప్రేమించి తెరకెక్కించిన ఫ్యాషన్ డిజైనర్ రిజల్ట్ జూన్ 2న తెలిసిపోనుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News