వేణు ఉడుగుల క‌థ‌ల్ని గీతా ఆర్స్ట్ లాక్ చేస్తుందా?

Update: 2022-07-25 00:30 GMT
`నీది నాది ఒకే క‌థ‌`..`విరాటప‌ర్వం` చిత్రాల‌తో యంగ్ మేక‌ర్ వేణు ఉడుగుల త‌న ప్ర‌త్యేక‌త‌ని చాటుకున్నారు. చేసినవి రెండు సినిమాలే అయిన మంచి  ర‌చ‌యిత‌గా గుర్తింపు ద‌క్కించుకున్నారు. మూస ధోర‌ణిలో వెళ్తోన్న టాలీవుడ్ ని అప్పుడ‌ప్ప‌డు ఇలాంటి ఇన్నోవేటివ్ మేక‌ర్స్ గాడిన పెడుతున్నారు. ఈ రెండు సినిమాలు క‌మ‌ర్శియ‌ల్ గా భారీగా కాసులు రాబ‌ట్ట‌క‌పోవ‌చ్చు.

కానీ టాలీవుడ్ క్రియేటివిటీ స్థాయిని ఇలాంటి చిత్రాలు ఎలుగెత్తి చాటుతున్నాయ‌న్న‌ది వాస్త‌వం. ఈ రెండు సినిమాలు థియేట్రిక‌ల్ గా యావ‌రేజ్ గా ఆడినా..ఓటీటీలో ఈ కంటెంట్ కి  మించి ఆద‌ర‌ణ ద‌క్కింది. ఇటీవ‌లే నెట్ ప్లిక్స్ లో అందుబాటులోకి వ‌చ్చిన  `విరాట ప‌ర్వం`ని కోట్లాది మంది వీక్షించారు. నెట్ ప్లిక్స్  చ‌రిత్ర‌లోనే ఈ సినిమాని ఎక్కువ మంది వీక్షించిన‌ట్లు తెలుస్తోంది.

ప్ర‌స్తుతం ఓటీటీలో ఇలాంటి కంటెంట్ కి మంచి ఆద‌ర‌ణ ద‌క్కుతోంది. ఇన్నోవేటివ్ థాట్స్ వెబ్ సిరీస్ గా రూపొందుతున్నాయంటే?   దాని వెనుక కార‌ణం ఆద‌ర‌ణ అన్న‌ది గుర్తించాల్సిన విష‌యం. ప్రేక్ష‌కుల ఆలోచ‌న‌ల్లో సైతం ఎన్నో మార్పులొస్తున్నాయి.  రొటీన్ కంటెంట్ కి  ఇప్ప‌డు  మునుప‌టంతా ఛాన్స్  క‌నిపించ‌డం లేదు. అందుకే సీనియ‌ర్ నిర్మాత అల్లు అర‌వింద్ లాంటి వారు న్యూ ట్యాలెంట్ ని ఎంత‌గానో ఎంక‌రేజ్ చేస్తున్నారు.

క్రియేటివ్ గా ఆలోచించ గ‌ల్గే వాళ్ల‌ని .. విష‌యం ఉన్న వాళ్ల‌ని తెలివిగా ఒడిసిప‌ట్టుకుంటున్నారు. మ‌రి ఇప్పుడాయ‌న క‌న్ను ఈ యంగ్ మేక‌ర్ పై ప‌డిందా? అంటే అవున‌నే గుస‌గుస వినిపిస్తుంది. ద‌ర్శ‌కుడు కాక‌ముందు వేణు రాసిపెట్టుకున్న్న క‌థ‌ల్ని న‌యా నిర్మాత‌గా తెలివిగా లాక్ చేస్తున్నారుట‌. యూనిక్ గా అనిపించిన క‌థ‌లకి మంచి ధ‌ర క‌ల్పించి వాటిని విక్ర‌యిస్తున్న‌ట్లు లీకులందుతున్నాయి.

వాటికి కొంత మంది సీరియ‌ర్ రైట‌ర్ల‌చే క‌మ‌ర్శియ‌ల్ టచ్ అప్ ఇచ్చి వెబ్ సిరీస్ లు గా మ‌లిస్తే బాగుంటుంద‌ని భావిస్తున్నారుట‌. సినిమాలు గా మ‌ల‌చ‌డానికి వీలుగా ఉన్న క‌థ‌ల్ని ఆర‌కంగానూ  సిద్దం చేయిస్తున్న‌ట్లు స‌మాచారం. మ‌రి ఈ విష‌యాలు  పెద్దాయ‌న ఖ‌రారు చేస్తే గానీ క్లారిటీ రాదు. ప్ర‌స్తుతం వేణు ఉడుగుల  కొత్త ప్రాజెక్ట్ ప‌నుల్లో బిజీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News